హిల్లరీ-ట్రంప్.. గెలుపెవరిది: ఓ మహిళ వినూత్న సర్వే, గతంలో ఫలించిన జోస్యం
వాషింగ్టన్: ఆమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలుస్తారా? రిపబ్లికన్ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తారా? అనే చర్చ సాగుతోంది. హిల్లరీ ఒకింత ముందంజలో ఉన్నారు. అయితే, ట్రంప్‌ను కూడా కొట్టిపారేయలేమని చెబుతున్నారు.
ఎక్కువ సర్వేలు మాత్రం హిల్లరీ క్లింటన్ గెలుపు ఖాయమని ఢంకా బజాయించి మరీ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ మహిళ మరో వినూత్న సర్వేకు తెరలేపింది. ఆమె 'కప్ సర్వే' ద్వారా ఎవరు గెలుస్తారనే విషయాన్ని అంచనా వేస్తోంది.
న్యూయార్క్‌లోని ఈస్ట్ హ్యాంప్టన్‌లో ఓ దుకాణం యజమానురాలైన స్మిత్ కప్ సర్వే చేస్తోంది. గత మూడు ఎన్నికల్లోనూ ఆమె జోస్యం సరైన ఫలితాలే ఇచ్చాయట. స్మిత్ తన దుకాణంలో కప్పులు విక్రయించి సర్వే చేస్తారు. వాటిపై అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ చిత్రాలు ఉంటాయి.

ఎవరి కప్పులు ఎక్కువ అమ్ముడు పోయాయో కాగితంపై రాసి దుకాణం బంద్ చేసే ముందు ప్రదర్శిస్తారు. ఒక వినియోగదారుడు కప్పులెన్ని కొన్నా ఒకటిగానే పరిగణిస్తారు.
ఈ సారి ఎన్నికలకు మార్చిలో జరిగిన సూపర్ ట్యూస్‌డే తర్వాతి రోజు నుంచి విక్రయాలు ప్రారంభించారు. ఇందులో ట్రంప్‌తో పోలిస్తే హిల్లరీనే ముందున్నారు. హిల్లరీ కప్పులు దాదాపు అయిదువేలు అమ్ముడు పోగా, ట్రంప్ కప్పులు దాదాపు నాలుగువేలు అమ్ముడుపోయాయి.












Click it and Unblock the Notifications