ఇండోనేషియాలో భూకంపం, ఒకరు మృతి
జకార్తా: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం వాటిల్లింది. .జావా ఐలాండ్‌లో ఈ భూకంపం వాటిల్లిందని అధికారులు ప్రకటించారు.
రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.5 గా నమోదైంది. అయితే సునామీ వచ్చే ప్రమాదం ఇప్పటికిప్పుడు లేదని అధికారులు ప్రకటించారు.

ఇండోనేషియా రాజధానికి సుమారు 300 కి.మీ దూరంలో భూకంపం నమోదైందని అధికారులు ప్రకటించారు.
భూకంపం కారణంగా పశ్చిమ జావా ప్రాంతంలో 62 ఏళ్ళ వ్యక్తి చనిపోయాడని అధికారులు ప్రకటించారు. భూకంపం కారణంగా ఇల్లు కూలిపోవడంతో ఆయన మరణించాడని అధికారులు గుర్తించారు.మరో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారని సమాచారం.












Click it and Unblock the Notifications