వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిండా మునిగిన న్యూయార్క్..అల్లకల్లోలం: 41 మంది మృతి: అమెరికా చరిత్రలోనే తొలిసారిగా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక రాజధానిగా పేరున్న న్యూయార్క్..అతలాకుతలమౌతోంది. ఊహకు అందనంత దుస్థితికి చేరింది. భయానక పరిస్థితులను చవి చూస్తోంది. హరికేన్ ఇడా (Hurricane Ida) సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఇడా హరికేన్ వల్ల ఏకధాటిగా కురిసిన అతి భారీ వర్షాల దెబ్బకు న్యూయార్క్‌ నిండా మునిగిపోయింది. హఠాత్తుగా సంభవించిన వరదలు న్యూయార్క్, న్యూజెర్సీల్లో కల్లోల పరిస్థితులకు దారి తీశాయి. ఈ వరదల్లో 41 మంది మృతిచెందారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు.

విమానాశ్రయాలు మూసివేత..

హరికేన్ ఇడా వల్ల న్యూయార్క్, న్యూజెర్సీల్లో ఏకధాటిగా అతి భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లన్నీ నదులను తలపించాయి. ఫ్లాష్ ఫ్లడ్ ఎమర్జెన్సీ వార్నింగ్‌ను జారీ చేశారు అక్కడి వాతావరణ విభాగం అధికారులు. వాతావరణం అనుకూలించకపోవడంతో న్యూయార్క్ విమానాశ్రయాన్ని మూసివేశారు. లా గార్డియా ఎయిర్‌పోర్ట్, నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయం, జాన్ ఎఫ్ కెన్నడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలను నిలిపివేశారు.

41 మంది మృతి

41 మంది మృతి

న్యూయార్క్ సిటీ సబ్‌వే లైన్లన్నీ మూసివేశారు. న్యూయార్క్, న్యూజెర్సీ, మన్‌హట్టన్, బ్రాంక్స్ అండ్ క్వీన్స్ నగరాల్లో రోడ్లపై పార్క్ చేసి ఉంచిన కార్లు పడవల్లా కొట్టుకెళ్లిపోయాయి. భారీ వాహనాలు సైతం వరద నీటిలో తేలియాడుతూ కనిపించాయి. న్యూయార్క్, న్యూజెర్సీల్లో 41 మందికి పైగా మరణించారు. వరదల వల్ల సంభవించిన ప్రమాదాల బారిన పడి 23 ఇప్పటిదాకా 23 మంది మరణించారని న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ తెలిపారు. ఎక్కువ మంది వాహనాల్లో చిక్కుకుపోయి.. మృతిచెందినట్లు సమాచారం అందిందని అన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.

ఏకధాటి వర్షానికి..

అపార్ట్‌మెంట్ బేస్‌మెంట్లలో ఒక్కసారిగా వరద పోటెత్తడంతో అక్కడి నుంచి బయటపడే మార్గం లేక పలువురు మరణించారు. న్యూయార్క్ శివార్లలోని వెస్ట్ ఛెస్టర్, పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో మరణాలు సంభవించాయి. గంట వ్యవధిలోనే 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. న్యూయార్క్ సెంట్రల్ పార్క్ ప్రాంతంలో గంట వ్యవధిలో 80 మీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల పట్ల న్యూయార్క్ మేయర్ బిల్ డే బ్లాసియో ఆందోళన వ్యక్తం చేశారు.

అంధకారంలో నగరాలు..

పెన్సిల్వేనియా-98,000, న్యూజెర్సీ-40,000, న్యూయార్క్- 60,000 నివాసాలకు కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని పవర్ అవుటేజ్ వెబ్‌సైట్ తెలిపింది. బ్రూక్లిన్, క్వీన్స్, లాంగ్ ఐలాండ్‌లోని అనేక ప్రాంతాల్లోఅత్యవసర పరిస్థితిని ప్రకటించారు అమెరికా వాతావరణ కేంద్రం అధికారులు. మసాచుసెట్స్, రోడ్ ఐలాండ్‌లోని కొన్ని ప్రాంతాలకు టోర్నడో హెచ్చరికలు జారీ చేశారు. మరిన్ని నగరాలకు టోర్నడోలు, వరదల వార్నింగ్‌లను జారీ చేశారు.

టోర్నడోలు బీభత్సం..

వాషింగ్టన్‌ను సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నపొలిస్ ప్రాంతంలో టోర్నడోలు బీభత్సాన్ని సృష్టించాయి. గరిష్ఠ వేగంతో సంభవించిన ఈ టోర్నడోలు అన్నపొలిస్ ప్రాంతంలో చెట్లను పెకిలించి వేశాయి. ఎలక్ట్రికల్ పోల్స్, హోర్డింగులు గాలికి ఎగిరిపోయాయి. ఈ పరిస్థితులు మరి కొన్ని గంటల పాటు కొనసాగే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఎవరూ ఇళ్లల్లో నుంచి బయటికి రావొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలని సూచించారు.

Recommended Video

IND vs ENG : Rain - Funny Memes | BAN Cricket In England || Oneindia Telugu

సురక్షిత ప్రదేశానికి

అపార్ట్‌మెంట్ బేస్‌మెంట్లల్లో ఉన్న వారిని స్థానిక పోలీసులు సురక్షిత ప్రదేశాలకు తరలించారు. వరద బీభత్సం సృష్టిస్తోన్నందున వాహనాలను నడిపే ప్రయత్నం చేయవద్దని న్యూయార్క్, న్యూజెర్సీ పోలీస్ అధికారులు సూచించారు. వరదల వల్ల కొట్టుకొచ్చిన పలు వాహనాల్లో మృతదేహాలు లభించాయని వారు స్పష్టం చేశారు. తదుపరి ఆదేశాలు అందేంత వరకూ ఎవరూ బయట తిరిగే ప్రయత్నం చేయొద్దని, ఎలాంటి సహాయం కావాలన్నా 911కు ఫోన్ చేయాలని సూచించారు.

English summary
Hurricane Ida killed at least 41 people in the New York area overnight on Thursday. Flash flood emergency warning for New York City, turned streets into rivers and shut down subway services.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X