అమెరికాలో మళ్లీ హరికేన్.. కరీబియన్ దీవులవైపు దూసుకొస్తున్న ‘మారియా’!
అమెరికాలో ఇర్మా హరికేన్ సృష్టించిన విలయం మరవకముందే ఇప్పుడు మరో హరికేన్ ముంచుకొస్తోంది. హరికేన్ ‘మారియా’ కరీబియన్ దీవుల వైపు దూసుకెళుతోంది. ఇప్పటికే లీవార్డ్ దీవులను చేరుకున్న ఈ హరికేన్ అత్
బార్బుడా: అమెరికాలో ఇర్మా హరికేన్ సృష్టించిన విలయం మరవకముందే ఇప్పుడు మరో హరికేన్ ముంచుకొస్తోంది. హరికేన్ 'మారియా' కరీబియన్ దీవుల వైపు దూసుకెళుతోంది. ఇప్పటికే లీవార్డ్ దీవులను చేరుకున్న ఈ హరికేన్ అత్యంత ప్రమాదకరంగా మారింది.
అమెరికా వాతావరణ కేంద్రం అధికారులు హరికేన్ ఇర్మాను గుర్తించారు. ప్రస్తుతం క్యాటగిరీ వన్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరో 48 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశాలున్నాయి. ఇర్మా ప్రయాణించిన మార్గంలోనే మారియా కూడా వెళుతున్నట్లు అమెరికా హరికేన్ సెంటర్ వెల్లడించింది.

గుడెలోప్, డోమ్నికా, సెయింట్ కిట్స్, నెవిస్, మాంట్‌సెర్టా, మార్టినీకీ దీవులకు హరికేన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మొన్న వచ్చిన హరికేన్ ఇర్మా దెబ్బకే కరీబియన్ దీవులు అతలాకుతలం అయ్యాయి.
ఇర్మా వల్ల కరీబియన్ దీవుల్లో 37 మంది మృతి చెందారు. బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది. ఆ దెబ్బనుంచి కాస్తయినా తేరుకోముందే ఇప్పుడు మళ్లీ హరికేన్ మారియా ప్రచండ వేగంతో దూసుకొస్తోంది. ఈసారి ఈ హరికేన్ వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో అనే ఆందోలన మొదలైంది.












Click it and Unblock the Notifications