హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో పుట్టిన అరుణా మిల్లర్.. మేరీల్యాండ్ తొలి ఇండియన్-అమెరికన్ గవర్నర్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ-అమెరికన్ రాజకీయ నాయకురాలిగా అరుణా మిల్లర్ చరిత్ర సృష్టించారు. బుధవారం ఆమె లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె భగవద్గీతపై చేయి వేసి ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు.

కాగా, అరుణా మిల్లర్‌ మేరీల్యాండ్ రాష్ట్రానికి 10వ లెఫ్టినెంట్ గవర్నర్. ఆమె 2010 నుంచి 2018 వరకు మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌లో కూడా పనిచేశారు. అక్కడ రెండు సార్లు పదవీకాలాన్ని పూర్తి చేశారు. భారతీయ-అమెరికన్లలో అరుణకు మంచి పేరుంది.

 Hyderabad-born Aruna Miller Sworn-in as Maryland’s First Indian American Lieutenant Governor

లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికలో చాలా మంది ట్రంప్ మద్దతుదారులు ఆమెకు మద్దతు ఇచ్చారు. కాగా, మేరీల్యాండ్‌లో నల్లజాతీయులు మూడు ఉన్నత స్థానాలకు ఎన్నికయ్యారు. వెస్ మూర్ గవర్నర్‌గా.. అరుణ లెఫ్టినెంట్ గవర్నర్‌గా, ఆంథోనీ బ్రౌన్ లెఫ్టినెంట్ జనరల్‌గా ఎన్నికయ్యారు.

హైదరాబాద్‌లో జన్మించిన 58 ఏళ్ల అరుణ.. 1972లో ఆమె కుటుంబంతో కలిసి ఏడేళ్ల వయస్సులో అమెరికా వెళ్లారు. 2000 సంవత్సరంలో అమెకు అమెరికా పౌరసత్వం లభించింది. అరుణ వృత్తి రీత్యా కెరియర్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీర్. మేరీల్యాండ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో 25 సంవత్సరాలు పనిచేశారు. అరుణ తండ్రి కూడా మెకానికల్ ఇంజినీర్.

మిల్లర్ డెమోక్రటిక్ టిక్కెట్‌పై ఎన్నికలలో పోటీ చేసి ఎన్నికల్లో గెలిచారు. మేరీల్యాండ్ తన మొదటి నల్లజాతి గవర్నర్ వెస్ మూర్‌ను కూడా ఎన్నుకుంది, ఆయన కూడా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా చరిత్రలో గవర్నర్‌గా ఎన్నికైన మూడో నల్లజాతి వ్యక్తి. మేరీల్యాండ్ తన మొదటి అటార్నీ జనరల్‌గా ఒక నల్లజాతి అమెరికన్‌ని, ఒక మహిళను కంట్రోలర్‌గా ఎన్నుకుంది.

మిల్లెర్ తన ఎన్నికల ప్రచారంలో అనేక మంది రిపబ్లికన్ల మద్దతును కూడా సంపాదించారు, వారిలో కొందరు ట్రంప్ అనుకూలురు. మిల్లర్ మేరీల్యాండ్‌లోని మోంట్‌గోమేరీ కౌంటీలోని స్థానిక రవాణా శాఖలో 25 సంవత్సరాలు పనిచేశారు.

'ఈ రోజు మనం చరిత్ర సృష్టించాము. అయితే అధికారం చరిత్ర సృష్టించడంలో లేదు, అధికారం ప్రజల్లో ఉంది. మీలో ప్రతి ఒక్కరిలోనూ. మేము ఈ ప్రయాణం ప్రారంభం నుంచి చెబుతున్నాము. ఈ రాత్రికి తేడా లేదు. ఈ రాత్రి మా గురించి కాదు, ఇది మీ గురించి, ఇది ఎల్లప్పుడూ ఉంది'అని మిల్లర్ తన ప్రమాణ స్వీకారం తర్వాత ట్వీట్ చేశారు.

English summary
Hyderabad-born Aruna Miller Sworn-in as Maryland’s First Indian American Lieutenant Governor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X