వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఫోన్ వాడనీయడం లేదు, బ్లాక్ బెర్రీ వాడుతా: ఒబామా

|
Google Oneindia TeluguNews

Barack Obama
వాషింగ్టన్: భద్రతా కారణాల వల్లే తాను ఐ ఫోన్‌ను ఉపయోగించడం లేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. తాను సురక్షితమైన, భద్రత కలిగిన బ్లాక్‌బెర్రీని వాడతానని బుధవారం ఆయన తెలిపారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో యువతతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆరోగ్య పరంగా తీసుకునే జాగ్రత్తలపై ఒబామా వివరించారు.

తాను భద్రతా కారణాల వల్లే ఐఫోన్‌ను అనుమతించనని ఈ సందర్భంగా ఒబామా తెలిపారు. అయితే తన కూతుళ్లు సశా, మలియాలు మాత్రం అత్యధిక సమయం వారి ఐఫోన్స్‌తోనే గడుపుతారని ఆయన చెప్పారు. బ్లాక్‌బెర్రీ భద్రత పరంగా నవీకరించబడిందని, అందుకే అధికారిక నగరం వాష్టింగ్టన్‌లో ఇప్పటికీ ఎక్కువ సంఖ్యలో ఉపయోగిస్తున్నారని చెప్పారు. యాపిల్ సంస్థ ఉత్పత్తి చేసిన మొబైల్స్‌ఫోన్స్‌తోపాటు వివిధ రకాల మొబైల్స్ ఫోన్స్‌కు మార్కెట్లలో డిమాండ్ తగ్గినా వీటికి తగ్గలేదని తెలిపారు.

జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్.. మొబైల్ ఫోన్ సంభాషణను అమెరికా రహస్యంగా వింది అనే ఆరోపణలు ఇటీవల వెల్లువెత్తిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుండా ఉండేందుకు, భద్రతా పరంగా ఉత్తమమైనదిగా ఉన్న బ్లాక్ బెర్రీని ఉపయోగిస్తున్నట్లు ఆయన చెప్పారు.

బరాక్ ఒబామా తన ప్రత్యేక కార్యకలాపాలను బ్లాక్ బెర్రీ ద్వారా కొనసాగిస్తారని, ఇతర సాధారణ విషయాలకు దూరంగా ఉండేందుకే ఒబామా బ్లాక్ బెర్రీని వినియోగిస్తున్నట్లు అతని సహాయకులు పేర్కొన్నారు. ఒబామాకు సంబంధించిన ఈ మెయిల్ వివరాలు కూడా అత్యంత గోప్యంగా ఉంటాయని, కొందరు ఉన్నతాధికారులకు, వ్యక్తిగత స్నేహితులకు మాత్రమే ఆయనకు సంబంధించిన వివరాలు తెలుస్తాయని చెప్పారు. భద్రతా పరమైన కారణాలతోనే ఇలాంటి చర్యలు చేపట్టడుతున్నట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.

English summary
US President Barack Obama admitted on Wednesday he was not allowed to have an iPhone owing to security fears -- explaining why he is sometimes seen with a bulky super secure BlackBerry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X