ఆమె ఓ వెర్రిబాగులది.. అయినా..,: డయానానూ వదలని ట్రంప్ నోటిదూల
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ నోటిదూల మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆయన అమెరికా అధ్యక్షుడు కాకముందు ఓ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంగ్లాండ్ రాణి ప్రిన్సెస్ డయానా గురించి అసభ్యంగా మాట్లాడారు.
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ నోటిదూల మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆయన అమెరికా అధ్యక్షుడు కాకముందు ఓ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంగ్లాండ్ రాణి ప్రిన్సెస్ డయానా గురించి అసభ్యంగా మాట్లాడారు.
డయానా ఓ వెర్రిబాగులదని, అయినప్పటికీ తాను కాదనకుండా ఆమెతో శృంగారంలో పాల్గొనేవాడినంటూ నోటితో పలకడానికి వీలుకాని మాటలు మాట్లాడారు. హోవార్డ్ స్టెర్న్ 2000 సంవత్సరంలో ట్రంప్ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన అన్న మాటలను తాజాగా చిన్న ట్రాన్‌స్క్రిప్ట్‌ల, ఆడియోల రూపంలో విడుదల చేసింది.

'ఆమె మంచి ఎత్తుంటుంది. మంచి రూపవతి. సూపర్ మోడల్, బ్యూటిఫుల్.. ఆకర్షణీయురాలు.. ఆమె చర్మం వర్ణించలేను... ఇంకా చెప్పాలంటే ఆమె ఒక వెర్రిబాగులది.. ఇవన్నీ కూడా కొద్ది వివరాలు మాత్రమే..' అంటూ డయానాను ఉద్దేశించి ట్రంప్ అన్నారు.
ఆమె వెర్రిబాగులది అయినప్పటికీ తాను ఆమెతో కాదనకుండా ఏకాంతంగా గడిపేవాడినని చెప్పారు. అంతేకాకుండా 1997లో స్టెర్న్‌కు, ట్రంప్‌కు మధ్య జరిగిన ఇంటర్వ్యూకు సంబంధించిన వివరాలు కూడా బయటపెట్టింది.
ఇందులో ట్రంప్ అనూహ్య కామెంట్లు చేశారు. తాను ఏ మహిళతోనైనా శృంగారంలో పాల్గొనాలనుకున్నప్పుడు ఆమెను హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోవాలని కోరేవాడినని అప్పటి ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పారు.
ఇక 2000 సంవత్సరంలో ఇంటర్వ్యూలో పాల్గొన్న ట్రంప్ టాప్ టెన్ హాట్ మహిళల గురించి చెప్పమన్పప్పుడు మొదటి స్థానంలో ఆయన మొదటి భార్యను, రెండో స్థానంలో ఆయన ప్రస్తుత భార్యను, మూడో స్థానంలో డయానాను పేర్కొన్నారట.












Click it and Unblock the Notifications