నేను ఎవరినైనా కాల్చేసినా ఓట్లు తగ్గవు: డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: రిపబ్లికన్‌ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవికి పోటీదారు డోనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను న్యూయార్క్‌లోని ఫిప్త్‌ ఎవెన్యూలో ఎవరినైనా తుపాకీతో కాల్చినా తన ఓట్లు ఏమాత్రం తగ్గవని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనను అభిమానులు అంతగా ఆరాధిస్తారన్నారు. ఇది అద్భుతమైన విషయం నా ప్రజలు అత్యంత తెలివైనవారని, నేను వారికి అత్యంత నమ్మకస్తుడను ఆయన వ్యాఖ్యానించారు. తనకు ఓటర్లు దూరం కాబోరని చెప్పారు.

లోవాలో తొలి నామినేటింగ్ పోటీకి మరో తొమ్మిది రోజుల సమయమున్న నేపథ్యంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ, సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. న్యూయార్క్‌లో బిలియనీర్‌గా, మాజీ టీవీ రియాలిటీ స్టార్‌గా ప్రజల్లో గుర్తింపున్న డొనాల్డ్ ట్రంప్ పోటీలో ఉన్న ఇతరులతో పోలిస్తే ప్రచారంలో దూసుకెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

I could 'shoot somebody and I wouldn't lose voters': Donald Trump

ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ముస్లింలను దేశం నుంచి తరిమికొట్టాలని వ్యాఖ్యానించారు. దేశంలోని ముస్లింలను బయటకు పంపుతానని ఒకసారి, అమెరికా -మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మిస్తానని మరోసారి అన్నారు.

మరోవైపు, లోవాలో ఆయనతో పోటీ పడుతున్న టెడ్ క్రూజ్ మాట్లాడుతూ.. వినండి, డొనాల్డ్ మాటలకు నేను అడ్డుపడనని,ప్రచారంలో భాగంగా ఎవరిపైనా విమర్శల తూటాలు వదలాలని నేను భావించడం లేదని, ప్రజలు ఆలోచించుకుని తమ నేతను ఎన్నుకుంటారని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+