వరల్డ్ కప్ ట్రోఫీపై ఐసీసీ, బీసీసీఐ సంచలనం: అంతరిక్షంలో ఆవిష్కరణ
ముంబై: ఐసీసీ వరల్డ్ కప్.. ఇంకో నాలుగు నెలల్లో ఈ బిగ్గెస్ట్ క్రికెట్ ఈవెంట్ ఆరంభం కాబోతోంది. దీనికోసం క్రికెట్ ఆడే అన్ని దేశాలు సన్నద్ధమౌతోన్నాయి. ద్వైపాక్షిక సిరీస్‌తో తీరిక లేని షెడ్యూల్స్‌ను ఎదుర్కొంటోన్నాయి. ఇది 13వ ఎడిషన్ వరల్డ్ కప్. ఇప్పటివరకు 12 మెగా టోర్నమెంట్లు ముగిశాయి. అత్యధికంగా ఆస్ట్రేలియా అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది.
భారత్, వెస్టిండీస్ రెండుసార్లు ఈ కప్‌ను ముద్దాడాయి. శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లాండ్ ఒక్కోసారి విజేతగా నిలిచాయి. 2019లో జరిగిన వరల్డ్ కప్‌ను ఇంగ్లాండ్ ఎగరేసుకెళ్లింది. ఈ సారి ఎవరు విన్నర్ అవుతారనేది ఆసక్తి రేపుతోంది. మొత్తం 10 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. భారత్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ క్వాలిఫై అయ్యాయి.

మరో మూడు జట్లు అర్హత సాధించాల్సి ఉంది. జింబాబ్వే, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఒమన్, నేపాల్, శ్రీలంక, యూఎస్ఏ, యూఏఈ, వెస్టిండీస్, ఐర్లాండ్.. ఈ బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం క్వాలిఫయర్లు జరుగుతున్నాయి. ప్రపంచకప్ టోర్నమెంట్ ఆడేందుకు జింబాబ్వే, శ్రీలంక అర్హత సాధించాయి. నెదర్లాండ్స్, స్కాట్లాండ్, వెస్టిండీస్ మూడో స్థానంలో కోసం పోటీపడుతున్నాయి.
వరల్డ్ కప్ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్, ఐసీసీ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఐసీసీ వరల్డ్ కప్ 2023 ట్రోఫీని అంతరిక్షంలో ఆవిష్కరించాయి. ఈ ట్రోఫీని భూమికి 1,20,000 అడుగుల ఎత్తులో ఉన్న స్ట్రాటోస్ఫియర్‌లో ప్రవేశపెట్టాయి. 4కే కెమెరాల ద్వారా భూవాతావరణంలో ఉన్న ట్రోఫీకి సంబంధించిన కొన్ని అద్భుతమైన షాట్‌లు తీశాయి.
The #CWC23 Trophy in space 🌠🤩
— ICC (@ICC) June 26, 2023
The ICC Men's Cricket World Cup 2023 Trophy Tour is HERE 👉 https://t.co/UiuH0XAg1J pic.twitter.com/48tMi6cuHh
ట్రోఫీ ఆవిష్కరణతో దీని వరల్డ్ టూర్ ఆరంభమైనట్టయింది. మంగళవారం నుంచి ఈ ట్రోఫీ భారత్ సహా కువైట్, బహ్రెయిన్, మలేషియా, అమెరికా, నైజీరియా, ఉగాండా, ఫ్రాన్స్, ఇటలీ సహా ప్రపంచవ్యాప్తంగా 18 దేశాలకు వెళ్లనుంది. 2019 తరువాత పూర్తి స్థాయి ట్రోఫీ టూర్ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ట్రోఫీ టూర్‌ను ప్రారంభించిన సందర్భంగా ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డిస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచ కప్ ట్రోఫీ టూర్ కౌంట్‌డౌన్‌లో దీన్ని ఓ మైలురాయిగా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారని, వారందరికీ చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా 18 దేశాల్లో ఈ ట్రోఫీ టూర్‌ను షెడ్యూల్ చేసినట్లు వివరించారు. బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ ఆరు వారాల పాటు సాగే వరల్డ్ కప్ టోర్నమెంట్.. చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications