వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్ కాటేసిన మేమున్నాం... కుటుంబానికి రెండేళ్ల జీతం, జాబ్ కూడా

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వల్ల చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కంపెనీలు అండగా ఉంటున్నాయి. ఆ వరసలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ చేరింది. కరోనాతో చనిపోయిన బ్యాంకు ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కలిగించాలని నిర్ణయించింది. కరోనాతో ఉద్యోగి చనిపోతే, బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది. ఉద్యోగి జీవిత భాగస్వామికి బ్యాంక్‌లో ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు బ్యాంక్ నాలుగు రెట్లు CTCని అందిస్తుంది. బ్యాంకు ఉద్యోగులు ఎక్కువగా యువకులేనని, బ్యాంక్ ఎండీ, సీఈఓ వి వైద్యనాథన్ వెల్లడించారు. కోవిడ్‌తో జరిగిన ప్రమాదంతో అతని కుటుంబం షాక్‌కు గువరవుతుందని.. అందువల్ల మేము ప్రతి ఒక్కరిని కవర్ చేసే అటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. వార్షిక సిటిసిని నాలుగు రెట్లు పెంచుతున్నామని... రెండేళ్లపాటు జీతం కూడా ఇవ్వబడుతుందని వివరించారు. దీంతో కుటుంబ సభ్యులు జీవనోపాధి పొందుతారని తెలిపారు.

idfc bank announce who dies for covid-19 family get job

ఒక ఉద్యోగి వ్యక్తిగత రుణం, కారు రుణం, ద్విచక్ర వాహనం లేదా విద్యా రుణం తీసుకుంటే అది పూర్తిగా మాఫీ అవుతుందని వైద్యనాథన్ తెలిపారు. రూ.25లక్షల వరకు గృహరుణాలు కూడా మాఫీ చేస్తామని ప్రకటించింది. ఉదాహరణకు, ఎవరైనా రూ.30 లక్షల వరకు రుణం తీసుకుంటే, బ్యాంక్ 25లక్షలు మాఫీ చేస్తుంది. మిగిలిన రుణం కుటుంబానికి బ్యాంకు ఇచ్చే జీతం నుంచి తిరిగి చెల్లించవలసి ఉంటుంది.

కరోనా వల్ల మరణించే ఉద్యోగి కుటుంబానికి 5 సంవత్సరాల పాటు ప్రతి నెల పూర్తి జీతం ఇస్తామని ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. మరణించిన ఉద్యోగి అందుకున్న చివరి జీతం ఆధారంగా ఈ జీతం మొత్తం ఉంటుందని అంటుంది. ఇంతకుముందు టాటా స్టీల్, టాటా మోటార్స్ తమ ఉద్యోగుల కోసం ఇలాంటి ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే.

కరోనా వల్ల మరణించిన తరువాత, ఉద్యోగి కుటుంబానికి ప్రతి నెల ప్రాథమిక జీతంలో సగం ఇస్తామని టాటా మోటార్స్ మేనేజ్‌మెంట్ తెలిపింది. ఇదికాక మరణించిన వారి కుటుంబానికి రూ. 60 లక్షల వరకు తక్షణ మరియు ఒకే మొత్తాన్ని ఇవ్వబడుతుంది. ఈ క్రమంలో మరిన్ని కంపెనీలు కోవిడ్ కారణంగా చనిపోయినవారిని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నాయి.

English summary
idfc bank announe who dies for covid family get job and two years sallary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X