ముస్లింలను నిషేధించాలన్న ట్రంప్ కు ముస్లిం డెలిగెట్ మద్దతు

Subscribe to Oneindia Telugu

క్లీవ్ లాండ్ : అమెరికా నుంచి ముస్లింలను నిషేధించాలంటున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు ఓ ముస్లిం డెలిగెట్ మద్దతు పలకడం హాట్ టాపిక్ గా మారింది. రిపబ్లికన్ పార్టీ సదస్సుల్లో భాగంగా క్లీవ్ లాండ్ లో జరిగిన సదస్సులో ముస్లి డెలిగెట్ సాజిద్ తరార్ ట్రంప్ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సదస్పు చివరలో మాట్లాడిన సాజిద్ తరార్.. ట్రంప్ గెలుపు కోసం అమెరికన్ ఓటర్లంతా మహమ్మద్ ప్రవక్తకు ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చాడు. మళ్లీ మనదేశాన్ని కాపాడే సామర్జ్యం ట్రంప్ కే ఉందని, మహాత్ములైన అమెరికన్ పూర్వీకులు అనుసరించిన విధానాలనే ట్రంప్ ఆచరణలో పెడుతారని సాజిద్ అన్నారు. ప్రసంగం చివరలో గాడ్ బ్లెస్ అమెరికా, గాడ్ బ్లెస్ ట్రంప్ అంటూ ప్రసంగాన్ని ముగించారు సాజిద్.

Imam’s closing prayer marred by Trump supporter’s ‘No Islam’ chant

వ్యూహాత్మకమేనా..?

అయితే ట్రంప్ ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ముస్లిం వర్గాల్లో ట్రంప్ పట్ల ఉన్న నెగటివ్ అభిప్రాయాన్ని తొలగించడానికే వ్యూహాత్మకంగా ముస్లిం డెలిగెట్ తో ట్రంప్ ను ప్రశంసించేలా చేశారన్న ఆరోపణలు లేకపోలేదు.

ఇదిలా ఉంటే, ట్రంప్ ను పూర్తిగా వెనకేసుకు వచ్చిన ముస్లిం డెలిగెట్ సాజిద్ తరార్.. ట్రంప్ ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను తాను వినలేదన్నారు. ఇస్లాం అమెరికన్లను ద్వేషిస్తుందని కూడా ట్రంప్ ఎప్పుడూ కామెంట్ చేయలేదన్నారు. సాంప్రదాయ రాజకీయ నేతలు సమస్యలను యథాతథంగానే కొనసాగిస్తారని, పనిచేయడం వారి వల్ల కాదని, అందుకే ట్రంప్ లాగే తాను సాంప్రదాయ రాజకీయాలకు వ్యతిరేకిస్తున్నాని ఈ సందర్బంగా సాజిద్ పేర్కొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The closing prayer at Republicans’ convention session Tuesday, delivered by a Muslim, was marred by a Trump supporter repeatedly chanting “No Islam,” exposing a still raw nerve within the GOP over how big the party’s tent should be.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి