ఇమ్రాన్ ఖాన్ పై పిడుగు- కొంపముంచిన నగల సెట్: జీవితమంతా జైళ్లోనే: కోర్టు తాజా తీర్పు

పాకిస్తాన్ తెహ్రీక్-ఇ- ఇన్సాఫ్ పార్టీ అధినేత, మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు ఆ దేశ న్యాయస్థానం బిగ్ షాక్ ఇచ్చింది. అవినీతి కేసులో ఆయనను దోషిగా నిర్ధారించింది. 17 సంవత్సరాల కారాగారశిక్షను విధించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే సంచలన తీర్పు వినిపించిందా కోర్టు. ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆయన సతీమణి బుష్రా బీబీకీ అదే శిక్ష పడింది. ఆమె కూడా 17 సంవత్సరాల జైలుశిక్షను ఎదుర్కొనబోతోంది.

పాకిస్తాన్ లో సంచలనం రేపిన తోషాఖానా- 2 అవినీతి కేసుకు సంబంధించిన తీర్పు ఇది. ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. అనంతరం ఈ తీర్పు వెలువడించింది. ఈ తీర్పు ఇమ్రాన్ ఖాన్, ఆయన పార్టీకి తీవ్ర ఎదురుదెబ్బగా భావిస్తోన్నారు. ఇప్పటికే 14 సంవత్సాల జైలు శిక్షను ఎదుర్కొంటోన్నారు ఇమ్రాన్ ఖాన్. తాజా తీర్పుతో ఇక ఆయన జీవితకాలం అంతా జైలులో గడపాల్సిన పరిస్థితి తలెత్తినట్టయింది.

Imran Khan and Bushra Bibi Hit with 17-Year Jail Term in Toshakhana Corruption Verdict

తోషాఖానా- 2 కేసు.. 2021 నాటిది. ఇమ్రాన్ ఖాన్‌కు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ బహుమతిగా ఇచ్చిన అత్యంత విలువైన, కోట్లాది రూపాయల విలువ చేసే బుల్గారి నగల సెట్‌కు సంబంధించినది. ఈ నగల సెట్ విలువ పాకిస్తాన్ కరెన్సీలో 7.15 కోట్ల రూపాయలకు పైమాటే. దీన్ని 58 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారని, ఈ విషయంలో ఇమ్రాన్ ఖాన్ నిబంధనలు ఉల్లంఘించారని దర్యాప్తులో తేలింది. కోర్టు దీనిని ప్రభుత్వ విశ్వాసఘాతుక చర్య, మోసపూరితం, అత్యంత అవినితిమయమైన చర్యగా పేర్కొంది.

రావల్పిండిలోని అదియాలా జైలులో ఈ విచారణలో జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక న్యాయమూర్తి షారుఖ్ అర్జుమాండ్ ఈ తీర్పును వెలువరించారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఇదే జైలులో ఉన్నారు. పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 409 కింద 10 ఏళ్ల కఠిన కారాగారం, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 5(2)47 కింద ఏడు సంవత్సరాల జైలు శిక్షతో కలిపి మొత్తం 17 ఏళ్ల శిక్ష విధించారు. అలాగే వీరిద్దరికీ రూ. 1.64 కోట్ల రూపాయలు) జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనపు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. తోషాఖానా 1 కేసు తీర్పును 2024 ఏప్రిల్‌లో ఇస్లామాబాద్ హైకోర్టు నిలిపివేసింది. ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని ఇమ్రాన్ ఖాన్ న్యాయవాదుల బృందం తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+