వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వృత్తి జీవితంలో ‘బాగా కష్టపడి పనిచేస్తే పైకి ఎదుగుతావు’.. ఇది నిజమా, అబద్ధమా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కెరీర్‌లో ఎదుగుదలకు కష్టపడటం కొంత వరకే సహాయపడుతుంది

అందరి కంటే ముందు ఉండటానికి తల దించుకుని మన పని మనం చేసుకుంటూ పోతే చాలనే సూత్రం చిన్నప్పటి నుంచి మన బుర్రలోకి ఎక్కించిన మాట అవాస్తవం. కానీ, అదొక్కటే సరిపోదని, పనితో పాటు మరికొన్నిఅంశాలు కెరీర్ ఎదుగుదలకు ఉపయోపడతాయని చెబుతున్నారు.

యూకే రచయిత కేట్ లిస్టర్ స్వీయ అనుభవంతో కెరీర్, కష్టపడేతత్వంపై ఓ అవగాహనకు వచ్చారు.

"మీరు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మంచి ప్రణాళికలు వేసుకున్నప్పుడు, మీ వయస్సు ఎంత? ఆ లక్ష్యం కోసం మీరు నిజంగా కష్టపడి పని చేయాలి. అడగకుండానే గుర్తింపు వస్తుందనే ఆశతో, మీరు చేయాల్సిన దాని కంటే ఎక్కువగా కష్టపడాలి.. ఇవన్నీ వట్టి కాకమ్మ కబుర్లే" అని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఈ మాటలను చాలామంది నమ్మారు. దాదాపు నాలుగు లక్షల మంది ట్వీట్‌ను లైక్ చేయడమో, రీట్వీట్ చేయడమో చేశారు.

కష్టపడి పని చేస్తే చాలని, అదే మిమ్మల్ని అందలం ఎక్కిస్తుందని చిన్నప్పటి నుండి సామెతలు, సలహాలు చెప్పేవారు. కానీ, అది నిజంగా జరగదని ఎగ్జిక్యూటివ్ కోచ్, హార్డ్ వర్క్ ఈజ్ ఎనఫ్ అనే పుస్తకాన్ని రచించిన జెఫ్ షానన్ చెప్పారు.

"హార్డ్ వర్క్ ఒక మంచి ప్రారంభం" అని ఆయన నమ్ముతారు. మీ కెరీర్ ప్రారంభంలో, అది మిమ్మల్ని ఉద్యోగంలో నిలబెట్టడానికి కచ్చితంగా సహాయపడుతుందంటారు షానన్.

కానీ మిమ్మల్ని పైస్థాయికి తీసుకెళ్లడానికి అదొక్కటే సరిపోదు.

"ఒక నిర్దిష్ట సమయంలో మీ చుట్టూ ఉన్నవారిని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఈ స్థాయిలో అందరూ కష్టపడి పని చేస్తారు. నైపుణ్యం, హార్డ్ వర్క్ ఉండి కూడా మిమ్మల్ని నిరీక్షించేలా చేస్తాయి. మీ స్థాయి నుంచి ఎదగడానికి అది సహాయపడదు."

అవును, ఇది అన్యాయం. వ్యవస్థ కష్టపడి పని చేసే వారి పనికి విలువ ఇవ్వదు. కానీ కార్మికులకు పనిలో పోరాటం తప్పదు. ఉద్యోగంలో ఎదుగుదలకు ఇది మరీ ముఖ్యం. నిజంగా ఎదుగుదల కావాలంటే, ఉద్యోగం కంటే ఎక్కువ పని చేయాలి.

మన కెరీర్‌లో ఎదుగుదల ఆగినప్పుడు, అదే నైపుణ్యం కలిగి, కెరీర్‌లో దూసుకుపోతున్న సహోద్యోగుల వైపు మనం చూస్తూ ఉంటామని లిస్టర్ వెల్లడించారు. ఎవరైతే రాజకీయంగా పావులు కదుపుతారో వారే ఉన్నత స్థానాలకు వెళతారని, మీరు మాత్రం గుర్తింపు అదే వస్తుందనుకుంటూ.. గదిలోనే పని చేస్తూ కూర్చుంటారని తెలిపారు.

మీరు పని చేస్తున్నట్లు ఎవరూ గుర్తించకపోతే, హార్డ్ వర్క్ చేసినా ఫలితం లేదని షానన్ చెప్పారు. మిమ్మల్ని ఇతరులు గుర్తించేలా చేసుకోవడం ద్వారానే ప్రమోషన్లు దొరుకుతాయని వివరించారు.

ప్రమోషన్ రావాలంటే బాస్‌ దృష్టిలో పడేలా మన ప్రణాళికలు ఉండాలి.

'టియారా ఎఫెక్ట్ ' ఉచ్చు

కష్టపడి పని చేయడం ఇప్పటికీ చాలా ముఖ్యమని అమెరికన్ కన్సల్టింగ్ సంస్థ నెగోషియేటింగ్ ఉమెన్ ఇంక్ ప్రెసిడెంట్ కరోల్ ఫ్రోహ్లింగర్ పేర్కొన్నారు. కానీ ఒకరు చెబితేనే కష్టపడతా అని వేచి ఉండటం హానికరమని తెలిపారు.

ఫ్రోహ్లింగర్ ఈ ధోరణిని "టియారా(కిరీటం) ఎఫెక్ట్" అని పిలుస్తారు (షెరిల్ శాండ్‌బర్గ్‌కి చెందిన లీన్ ఇన్‌లో కూడా ఈ పదాన్ని పేర్కొన్నారు).

"ప్రజలు నిజంగా కష్టపడి పని చేస్తారు. అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. సరైన వ్యక్తులు దాన్ని గమనించి, వారి తలపై కిరీటం పెడతారని ఆశిస్తారు. కానీ అది సాధారణంగా జరగదు" అని ఆమె వెల్లడించారు. "మంచిగా పని చేసే వ్యక్తులను నిరంతరం గమనిస్తూనే ఉంటారు. ప్రమోషన్‌ల టైమ్ వచ్చినప్పుడు మాత్రం వారి గురించి ఎవరూ ఆలోచించరు. అందరూ వారి గురించి మర్చిపోతారు."

కష్టపడి పని చేసే వారిని మాత్రమే విజయం వరిస్తుందనే శిక్షణ స్కూలు నుంచే మొదలవుతుంది. ఎదుగుతున్న సమయంలో ఉపాధ్యాయులు అలాంటి లక్షణాలు కలిగిన వారికి బహుమతులు ఇస్తారు. దాంతో అదే తరహా ప్రవర్తనను మనం ఉద్యోగం చేసేటప్పుడు ఉన్నతాధికారుల నుంచి కూడా ఆశిస్తాం.

కానీ, మనకు నేర్పించిన పాఠాలు, నిజమైన ప్రపంచంలో నిజం కాదని తెలిసినప్పుడు నిరాశ కలుగుతుంది.

వాస్తవానికి, షానన్ పేర్కొన్నట్లుగా, కష్టపడి పని చేయడానికి ఒక నిర్దిష్ట స్థాయి తర్వాత గుర్తింపు ఉండదు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ అదే స్థాయిలో పని చేస్తున్నారు. మీరు ఇతర మార్గాల్లో దృష్టిని బాస్‌ని ఆకర్షించకపోతే, మీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.

సూపర్ వైజర్లు సహజంగా పురుషులు, మహిళల శ్రమను పట్టించుకోకుండా వారితో పని చేయించుకుంటారు. అయితే, పురుషుల కన్నా మహిళలు ఈ విషయంలో ఎక్కువగా ప్రభావితమవుతున్నారని ఫ్రోహ్లింగర్ చెప్పారు. ఎందుకంటే పురుషులు వారి విజయాల గురించి మాట్లాడటం సర్వ సాధారణంగా భావిస్తారు.

"మహిళల విషయానికొస్తే, ఇది గొప్పలు చెప్పుకుంటున్నట్లుగా అనిపించొచ్చు. అలా గొప్పలు చెప్పుకునే స్త్రీలు శిక్షలకు గురి కావొచ్చు" అని ఆమె చెప్పారు.

కాబట్టి, మీరు మూస పద్ధతిని ఎలా దాటాలి? పురుషులు, మహిళలకు ఇద్దరికీ సమాధానం ఒకటే. వార్షిక సమీక్ష లేదా పనితీరు అంచనా వంటి ఏటా జరిగే కార్యక్రమాల కోసం వేచి చూడకుండా, గుర్తింపు పొందే మార్గాల కోసం అన్వేషించాలి.

"చాలా కంపెనీలు, సంస్థలలో ఏం జరుగుతుందంటే, మీరు 'ఐ లవ్ మి' మెమోను సంవత్సరం చివర ఇస్తారు" అని ఫ్రోహ్లింగర్ చెప్పారు. "అయితే మీరు ఇందుకోసం ఒక సంవత్సరం వేచి ఉండకూడదు" అంటారామె.

బాస్‌కు తరచుగా క్లుప్తమైన అప్ డేట్స్ అందించాలని, సందర్భోచితంగా విజయాలను గుర్తు చేస్తూ ఉండాలని ఆమె సూచిస్తున్నారు. "ఇది కొన్ని బుల్లెట్ పాయింట్‌లతో కూడిన ఈ-మెయిల్ కావచ్చు. అందులో నువ్వు సాధించిన విజయాలు, మా కోసం మీరు ఏం చేశారన్న వివరణా ఉండాలి" అని ఆమె పేర్కొన్నారు.

"నా పని మన టీమ్‌ సభ్యులకు ఎలా సహాయపడింది, లేదా కంపెనీ డబ్బును ఎలా ఆదా చేయగలిగాను" ఇలాంటి విషయాలను తరచుగా ప్రస్తావించడం, అలా చేసేటప్పుడు వాడే పదాలు కూడా ముఖ్యమని ఫ్రోహ్లింగర్ తెలిపారు.

"ప్రతిరోజూ ఎవరూ ఒకే మాట వినడానికి ఇష్టపడరు. 'మై టీమ్ అండ్ ఐ' వంటి పద బంధాలను ఉపయోగించడం వల్ల మీకు మంచి జరుగుతుంది. అలాగే మీ మీద నమ్మకం కూడా పెరుగుతుంది.

ఫ్రేమింగ్ కూడా ముఖ్యం. మీ సొంత ప్రశంసలతో ఒక అప్‌డేట్‌ రావడం, మీ బాస్‌కు వింతగా అనిపించొచ్చు. కానీ అది వారి దృష్టిలో పడటానికి ఓ ఉత్తమ మార్గమని ఫ్రోహ్లింగర్ వెల్లడించారు.

నువ్వు ఏం సాధించావో ఏడాది చివరలో చెప్పుకుంటే లాభంలేదు.

రాజకీయాల విలువ

చాలా ఆఫీసులు, పరిశ్రమల్లో మీ సామర్థ్యం మాత్రమే ఉన్నత స్థాయికి చేరుకునేందుకు సాయపడదు. ఎందుకంటే మిమ్మల్ని అందరూ ఇష్టపడాలి. మిమ్మల్ని వారు మర్చిపోకూడదు. "మీరు ప్రభావం చూపించాలంటే, మిమ్మల్ని నమ్మేవారు ఉండాలి" అని షానన్ చెప్పారు.

అదే విధంగా వారు మద్దతునిచ్చి వారినే తమ అభ్యర్థిని కూడా చేస్తారు.

సాధారణంగా, ఎదగాలంటే బాగా పని చేస్తేనే సరిపోదు. ఒక చిన్న సైజు రాజకీయ నాయకుడిగా మారాలి.

"మిమ్మల్ని ఇంకొకరు నాయకుడిగా చూడాలి" అని ఫ్రోహ్లింగర్ చెప్పారు. "మీ స్థాయిలో ఉన్న వ్యక్తులు, మీకు పైన ఉన్న వ్యక్తులు, మీ కంటే దిగువస్థాయి వ్యక్తులు మిమ్మల్ని ఇష్టపడాల్సిన అవసరం ఉంది.

ఒక వ్యక్తి పనిని అసెస్ చేసేటప్పుడు, అందరిలా సమానంగా పని చేసినా, ఆయన లేదా ఆమెను ఇష్టపడే వ్యక్తులు ఎక్కువమంది ఉన్నవారు మెరుగైన రేటింగ్‌లను పొందుతారని పరిశోధనలలో తేలింది.

ఇది అన్యాయమైనా, అంతర్లీనంగా ఓ వాస్తవం దాగి ఉంది. మీకు, మీ సహోద్యోగికి ఒకే రకమైన నైపుణ్యాలు, పని తీరు ఉండవచ్చు. కానీ, మీరు స్నేహితులను సంపాదించడానికి, వ్యక్తులను ప్రభావితం చేయడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తే, వారికి పనిలో మెరుగ్గా మీరే కనిపిస్తారు.

ఉన్నతాధికారులు కూడా మనుషులే, వారికి నచ్చిన వ్యక్తులకు అనుకూలంగా ఉండటం మనిషి ప్రాథమిక స్వభావం.

అయితే, పనిలో రాజకీయ పలుకుబడి పెంచుకోవడం చాలా సులువే. మీ సహోద్యోగులపై దృష్టి పెట్టడం ద్వారా కొన్ని వ్యూహాలతో మిమ్మల్ని ఆఫీసులో అందరూ ఇష్టపడేలా చేసుకోవచ్చు.

"పని మీద కాకుండా ఇతర వ్యక్తులతో ఎలా కనెక్ట్ అవ్వాలనే దాని గురించి మీరు ఆలోచించాలి" అని ఫ్రోహ్లింగర్ చెప్పారు. "మనకు ఒకే రకమైన అభిరుచి లేదా ఆసక్తి ఉందనుకుందాం. మీకు తోటపని ఇష్టం అని నాకు తెలుసు. నేను ఓ తోట పని కథనాన్ని చూశాను. దాన్ని నేను మీకు పంపుతాను. చాలా సులువుగా మీరు నన్ను మరింత ఇష్టపడతారు"

ఇది కొంచెం అవకాశవాదంగా అనిపించినా, వాస్తవానికి ఎవరినీ బాధించదు. దాంతోపాటు మీరు మరింత ముందుకు వెళ్లేందుకు ఉపయోగపడుతుంది. సామాజిక జీవితం కంటే వారు చేయవలసిన పనుల జాబితా ప్రాధాన్యతలపై దృష్టి పెట్టాలి.

స్వభావానికి విరుద్ధంగా వెళ్లడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇదంతా కెరీర్ నిర్వహణలో భాగం, ఇది ప్రతి కార్మికుడి బాధ్యత అని ఫ్రోహ్లింగర్ చెప్పారు.

"మీరు మీ కెరీర్‌ను జాగ్రత్తగా చూసుకోకపోతే, మీరు చేయాల్సిన మీ పనిని మరెవరూ చేయరు" అని ఆమె పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
In Professional life if you work hard you will grow in life,Is this true or False
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X