వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా : ఈ రాష్ట్రాల్లో ఇంకా కొనసాగుతోన్న కౌంటింగ్... ఇప్పటివరకూ ఎన్ని ఓట్లు లెక్కించారంటే...

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు సర్వత్రా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఒకరకంగా సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల ప్రకారం జో బైడెన్ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటికే 264 ఎలక్టోరల్ కాలేజ్‌లను గెలుచుకున్న ఆయన... విజయానికి కేవలం ఆరు ఎలక్టోరల్ కాలేజ్‌ల దూరంలో ఉన్నారు. నిజానికి మొదటి నుంచి బైడెన్ ఓటింగ్ శాతంగా నిలకడగా పెరుగుతూ వచ్చింది. ట్రంప్ మాత్రం మొదట్లో వెనుకబడి... ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని... చివరలో మళ్లీ వెనుకబడ్డారు. అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండటంతో... ఫలితాలు ఏ టర్న్ తీసుకుంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది.

అలస్కాలో 47శాతం ఓట్ల లెక్కింపు...

అలస్కాలో 47శాతం ఓట్ల లెక్కింపు...

అలస్కా రాష్ట్రంలో ఇప్పటివరకూ కేవలం 47శాతం ఓట్లను మాత్రమే లెక్కించినట్లు అంచనా వేస్తున్నారు. మిగతా ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల ప్రకారం అక్కడ అధ్యక్షుడు ట్రంప్ 62.9శాతం ఓట్లతో ముందంజలో ఉన్నారు. మొదట్లో 33శాతం ఓట్లకే పరిమితమైన ఆయన... ఆ తర్వాత క్రమంగా పుంజుకున్నారు. అయితే ఇంకా లెక్కించాల్సిన ఓట్లు చాలానే ఉండటంతో... తుది ఫలితం ఎవరికి అనుకూలంగా ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేం.

అరిజోనా...

అరిజోనా...

అరిజోనాలో ఇప్పటివరకూ 86శాతం ఓట్లను మాత్రమే లెక్కించినట్లు అంచనా. ఇప్పటివరకూ 51శాతం ఓట్లతో డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ ఇక్కడ ముందంజలో ఉన్నారు. ట్రంప్ 47.6శాతం ఓట్లతో వెనుకబడ్డారు. అరిజోనాలో అధిక జనాభా కలిగిన మారికోపా కౌంటీకి చెందిన 4లక్షల ఓట్లను ఇంకా లెక్కించాల్సి ఉందని ఆ రాష్ట్ర సెక్రటరీ కేటీ హోబ్స్ తెలిపారు. గురువారం రాత్రి 9.30గంటలకు ఆ ఫలితాలు వెల్లడవుతాయని చెప్పారు.

జార్జియా...

జార్జియా...


జార్జియాలో ఇప్పటివరకూ 94శాతం ఓట్లను లెక్కించినట్లు అంచనా. ఇప్పటివరకూ ట్రంప్ 50శాతం ఓట్లతో స్వల్ప ఆధిక్యతలో ఉన్నారు. బైడెన్ 48శాతం ఓట్లను పొందారు. అయితే మరో ఆరు శాతం ఓట్లు లెక్కించాల్సి ఉండటంతో చివరి నిమిషంలో ఫలితం ఎవరికి అనుకూలంగా మారుతుందో తెలియదు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా 0.5శాతంగా ఉంటే... అధ్యక్ష అభ్యర్థులు ఇక్కడ రీకౌంటింగ్ కోరే అవకాశం ఉంది.

మిచిగాన్‌

మిచిగాన్‌

మిచిగాన్‌లో ఇప్పటివరకూ 97శాతం ఓట్లను లెక్కించినట్లు అంచనా. ఇక్కడ జో బైడెన్ 49.8శాతం ఓట్లతో స్వల్ప ముందంజలో ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ 48.6శాతం ఓట్లతో వెనుకబడ్డారు. మిచిగాన్‌లోని పెద్ద నగరం డెట్రాయిట్‌లో ఇప్పటివరకూ 95శాతం లెక్కింపు పూర్తవగా బైడెన్ 67.6శాతంతో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు.వేన్,క్లచ్ వంటి పట్టణాల్లో ఓటింగ్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.

నార్త్ కరోలినా...

నార్త్ కరోలినా...

నార్త్ కరోనాలినాలో ఇప్పటివరకూ 95శాతం కౌంటింగ్ పూర్తయినట్లు అంచనా. ఇక్కడ ట్రంప్‌కు బైడెన్‌కు మధ్య కేవలం 2శాతం ఓట్ల తేడా మాత్రమే ఉంది. ట్రంప్‌కు 50.1శాతం ఓట్లు సాధించగా,బైడెన్ 48.7శాతం ఓట్లు సాధించారు. మెయిల్ బ్యాలెట్స్ ఓట్లు ఇంకా వస్తుండటంతో ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది.

పెన్సిల్వేనియా,విస్కాన్సిన్...

పెన్సిల్వేనియా,విస్కాన్సిన్...

కీలక రాష్ట్రాల్లో ఒకటైన పెన్సిల్వేనియాలో ఇప్పటివరకూ 85శాతం ఓట్లను లెక్కించినట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల ప్రకారం ట్రంప్ ఇక్కడ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు 51.7శాతం ఓట్లు పోల్ అవగా... బైడెన్‌కు 47.1శాతం ఓట్లు పోల్ అయ్యాయి. శుక్రవారం వరకు ఇక్కడ మెయిల్ బ్యాలెట్స్‌ ఓట్లను అనుమతించనున్నారు. దీంతో తుది ఫలితం మరింత ఆలస్యం కావచ్చు.విస్కాన్సిన్‌లో ఇప్పటివరకూ 99శాతం కౌంటింగ్ పూర్తయినట్లు అంచనా. అయితే ఇక్కడ బైడెన్ ట్రంప్ మధ్య 1శాతం కంటే తక్కువ ఓట్ల తేడా ఉండటంతో ట్రంప్ క్యాంపెయిన్ రీకౌంటింగ్ కోరుతోంది.

English summary
Democratic nominee Joe Biden has a slight edge over Republican President Donald Trump with 227 to 213 electoral votes. That leaves 98 electoral votes to be allocated, and possible paths to victory for both candidates. The winner needs to secure 270 votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X