యుద్ధం ఆపి ఉక్రెయిన్ తో చర్చించండి- రష్యాలోనే తేల్చిచెప్పేసిన విదేశాంగమంత్రి జైశంకర్..
ఉక్రెయిన్ పై రష్యా పోరు మొదలుపెట్టి నెలలు గడిచిపోతున్నా యుద్దం ఎప్పుడు ఆగుతుందో తెలియడం లేదు. ఓవైపు భారత్ వంటి మిత్రదేశాలు నచ్చచెబుతున్నా మరోవైపు పాశ్చాత్య దేశాల నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనతో రష్యా యుద్ధ విరమణపై నిర్ణయం తీసుకోలేకపోతోంది. అటు అణుబాంబులేస్తామంటూ ఉక్రెయిన్ ను పుతిన్ హెచ్చరించినా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో రష్యాలో పర్యటిస్తున్న భారత విదేశాంగమంత్రి జైశంకర్ ఇవాళ ఆ దేశానికి కీలక సలహా ఇచ్చారు.
Indian foreign minister Jaishankar on his way to Moscow.
— S.L. Kanthan (@Kanthan2030) November 7, 2022
Russia has already released a statement that the two countries will work for a “polycentric world” and against any “imperialist agenda.”
Other plans include bypassing US dollar in bilateral trade.
USA will not be happy. pic.twitter.com/0Oe8zuvPaL
ఉక్రెయిన్ తో గతంలో ఆపేసిన చర్చల్ని పునరుద్ధరించాలని రష్యాను భారత విదేశాంగమంత్రి జైశంకర్ కోరారు.ఇవాళ మాస్కోలో రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ తో భేటీ అయిన జైశంకర్ అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్దితులతో పాటు ఉక్రెయిన్ తో యుద్ధం నిలిపివేతపైనా చర్చించారు. ఇది యుద్ధాల యుగం కాదని ఆయనకు మరోసారి తేల్చిచెప్పారు. కోవిడ్ నేపథ్యంలో అంతర్జాతీయ పరిస్ధితులు క్షీణించాయని, ఆర్ధిక ఇబ్బందులతో పాటు వాణిజ్య సమస్యలు కూడా పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పరిస్దితులు మరింత క్షీణిస్తున్నట్లు జైశంకర్ వెల్లడించారు.
🇮🇳🤝🇷🇺 #Jaishankar: I believe this is the fifth time we are meeting this year. I think that speaks of our long term partnership and the importance that we attach to each other. And I am really glad to be here today in #Moscow to carry forward this dialogue. https://t.co/TTiHjl4q1s pic.twitter.com/0CLMuxnDJM
— Russia in India 🇷🇺 (@RusEmbIndia) November 8, 2022

ఓవైపు ఉగ్రవాదం, వాతావరణ మార్పుల శాశ్వత సమస్యలు కూడా ఉన్నాయని, యుద్ధం వల్ల వీటిపైనా తీవ్ర ప్రభావం పడుతోందని జైశంకర్ ఆందోళన వ్యక్తంచేశారు. రష్యా విదేశాంగమంత్రితో తన చర్చలు మొత్తం ప్రపంచ పరిస్థితులతో పాటు నిర్దిష్ట ప్రాంతీయ ఆందోళనలను పరిష్కరిస్తాయని జైశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.భారతదేశం, రష్యా వివిధ స్థాయిలలో బలమైన, నిరంతర సంబంధాలను కొనసాగిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెప్టెంబర్‌లో సమర్‌కంద్‌లో ఈ మధ్యే భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications