అజర్‌బైజాన్‌కు భారత్ బిగ్ షాక్!
చైనాలోని టియాంజిన్‌లో జరిగిన రెండు రోజుల షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO) శిఖరాగ్ర సమావేశంపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఈ సమావేశంలో సభ్య దేశాలైన భారత్, చైనా సహా అన్ని దేశాల నాయకులు పాల్గొన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో భారత్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఇప్పుడు అజర్‌బైజాన్‌కు నిరాశను మిగిల్చింది.
భారత్ నిర్ణయంతో నిరాశలో అజర్‌బైజాన్
ప్రపంచంలోని అనేక దేశాలు ఎస్‌సీఓలో సభ్యత్వాన్ని పొందాలని ఆసక్తి చూపుతున్నాయి. వాటిలో ఒకటి అజర్‌బైజాన్. ఈ దేశానికి సభ్యత్వం కల్పించడానికి చైనా మద్దతు కూడా ఉంది. కానీ ఈ ప్రతిపాదనను భారత్ తిరస్కరించినట్లు సమాచారం. అజర్‌బైజాన్‌కు బిగ్ షాక్ తగిలింది.

పాకిస్థాన్‌తో స్నేహమే కారణమా?
అజర్‌బైజాన్‌కు పాకిస్థాన్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే భారత్ ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మే నెలలో భారత్ 'ఆపరేషన్ సింధూర్'ను నిర్వహించినప్పుడు, అజర్‌బైజాన్ పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు పలికింది. దీనికి ప్రతీకారంగానే భారత్ ఇప్పుడు ఎస్‌సీఓలో అజర్‌బైజాన్ ఎంట్రీని అడ్డుకుందని తెలుస్తోంది.
భారత్‌పై అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఆరోపణలు
షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్యత్వం లభించకపోవడంపై అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలీయేవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌తో తమకున్న మంచి సంబంధాల కారణంగానే భారత్ తమపై పగ తీర్చుకుంటోందని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ భారత్ వైఖరి ఎలా ఉన్నా తమ దేశం పాకిస్థాన్‌తో బలమైన సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తుందని ఇల్హామ్ అలీయేవ్ స్పష్టం చేశారు. ఈ సంఘటన భవిష్యత్తులో భారత్, అజర్‌బైజాన్ సంబంధాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications