వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో నూక్లియర్ సిటీ: అమెరికా పత్రిక సంచలనం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హైడ్రోజన్ బాంబుల (థెర్మోస్ న్యూక్లియర్ వెపన్స్) తయారీకి అణు పరిశోధనల నిమిత్తం దేశంలోని న్యూక్లియర్ రియాక్టర్లకు అవసరమైన ఇంధనం కోసం భారత్ గత నాలుగేళ్లుగా అత్యుత్తమ న్యూక్లియర్ సిటీని నిర్మిస్తోందంటూ అమెరికాకు చెందిన ఫారిన్ పాలసీ జర్నల్ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.

కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌కు సమీపంలోని చల్లకెరెలో ఈ న్యూక్లియర్ సిటీని నిర్మించడం ద్వారా భారత్ అత్యంత శక్తివంతమైన అణ్వస్త్రదేశంగా అవతరిస్తుందని, అయితే ఈ పరిమాణం భారత్ పొరుగుదేశాలైన పాకిస్థాన్, చైనాలను తీవ్ర అసహనానికి గురి చేస్తాయని అందులో పేర్కొంది.

చెళ్లకెరెలోని నిర్మిస్తున్న న్యూక్లియర్ సిటీ నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరుగుతోందని, దీని కోసం ఎన్నో ఏళ్లుగా అక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న స్థానికులను సైతం తరిమేశారని ఆ కథనంలో ఆరోపించింది.

India building top-secret nuclear city: Leading American foreign policy journal

2017నాటికి పూర్తి కానున్న ఈ న్యూక్లియర్ సిటీ నగరం భారత ఉపఖండంలోనే సైన్యం నిర్వహణలో నడిచే అతిపెద్ద న్యూక్లియర్ సెంట్రీఫ్యూజుల కేంద్రంగా, అణు పరిశోధన ప్రయోగశాలలు, ఆయుధాలు, విమానాల పరీక్షా కేంద్రంగా నిలుస్తుందని వెల్లడించింది.

ఈ న్యూక్లియర్ సిటీలో భారత్ శుద్ధచేసిన యురేనియం ఇంధన నిల్వలను పెంచుకుని హైడ్రోజన్ బాంబులను తయారు చేస్తున్నట్లు రిటైరైన భారత అధికారులను, లండన్, వాషింగ్టన్ నగరాలకు చెందిన నిపుణులను ఉదహరిస్తూ తెలిపింది. ఫారిన్ పాలసీ జర్నల్ ప్రచురించిన దాదుప ఏడు పేజీల ఈ కథనంలో భారత్, అమెరికా దేశాల అధికారిక స్పందనను మాత్రం ప్రచురించలేదు.

కానీ, పేర్లు చెప్పుకుండా భారత్, అమెరికాలను చెందిన అధికారులంటూ పలువురిని ఉటంకించింది. 'మైసురూను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. చెళ్లకెరెలో పురోగతిని క్రమం తప్పకుండా చూస్తున్నాం' అని వైట్ హౌస్‌కు చెందిన ఓ మాజీ అధికారి పేర్కొన్నట్టు ఆ పత్రిక ఆ కథనంలో పేర్కొంది.

ఈ నిర్మాణాలన్నీ మరో రెండేళ్లలో (2017 నాటికి) పూర్తవుతాయి. ఈ పనులన్నీ పూర్తయితే భారత ఉపఖండంలోనే ఈ అణ్వస్త్ర కేంద్రం అతి పెద్దదిగా వినుతికెక్కనుంది. ఈ మేరకు అంతర్జాతీయ మేగజీన్ ‘ఫారిన్ పాలసీ' ఓ ఆసక్తికర కథనాన్ని రాసింది. కాగా, ఈ న్యూక్లియర్ సిటీ ఒప్పందం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయంలో ఒప్పందం కుదిరింది.

English summary
A leading American foreign policy journal today alleged that India is building a top-secret nuclear city to produce thermos nuclear weapons which would upgrade the country as a nuclear power and unsettle its two major neighbours - Pakistan and China.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X