Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ladakh standoff: చైనాతో మళ్లీ చర్చలు -డ్రాగన్ ఒకే చెప్పిందన్న కేంద్రం -అరుణాచల్‌లో గ్రామంపై..

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి గడిచిన 10 నెలలుగా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. గత జూన్ లో తూర్పు లదాక్ లోని గల్వాన్ లోయలో హింసాత్మక ఘర్షణల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడం, యుద్ధ పరిస్థితులు నెలకొనడం తెలిసిందే. సరిహద్దులో తిరిగి సాధారణ స్థితి నెలకొనేలా సైనిక, దౌత్య మార్గాల్లో చర్చలు జరిగినా ఆశించిన ఫలితం రాలేదు. కాగా, రెండు దేశాలు మరోసారి చర్చలు సిద్ధమయ్యాయి..

Recommended Video

    #Indiachinastandoff: Breakthrough in India-China Talks | Oneindia Telugu

    లదాక్ సహా ఎల్ఏసీ వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలు సడలిపోయే దిశగా మళ్లీ చర్చలు కొనసాగించాలని భారత్-చైనాలు అంగీకారానికి వచ్చినట్లు మన దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆయనీ విషయాలను వెల్లడించారు..

    india-china-to-hold-next-round-of-senior-commander-level-talks-soon-mea

    భారత్, చైనా సైన్యాలకు చెందిన సీనియర్ కమాండర్ స్థాయి అధికారుల మధ్య తదుపరి రౌండ్ చర్చలు త్వరలోనే ప్రారంభం కానున్నాయని, ఇందుకోసం దౌత్య, సైనిక మార్గాల ద్వారా ఇరువర్గాలు సంభాషణను కొనసాగిస్తున్నాయని శ్రీవాస్తవ చెప్పారు.

    సరిహద్దు సమస్యలు, వివాదాల పరిష్కారం కోసం భారత్, చైనాల మధ్య 'వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్' ఒప్పందం కొనసాగుతోన్న దరిమిలా చివరిసారిగా డిసెంబర్ 18న రెండు దేశాల సైనిక అధికారులు చర్చలు జరిపారు. దాదాపు 40 రోజుల గ్యాప్ తర్వాత తదుపరి రౌండ్ చర్చలుంటాయన్న ప్రకటన వెలువడింది. ఇదిలా ఉంటే..

    india-china-to-hold-next-round-of-senior-commander-level-talks-soon-mea

    అరుణాచల్‌ ప్రదేశ్‌లో.. మన భూభాగంపై చైనా కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేసినట్లు ఇటీవల వచ్చిన వార్తను భారత ప్రభుత్వం ఖండించనప్పటికీ, అధికార బీజేపీ నేతలు అది అవాస్తవమని పేర్కొన్నారు. తాజాగా ఈ వ్యవహారంపై చైనా వివరణ ఇచ్చింది. గ్రామాన్ని తమ భూభాగంలోనే నిర్మించుకున్నామని, అవి కూడా సాధారణ నిర్మాణాలేతప్ప సైనిక వసతులు కావని చైనా పేర్కొంది. అరుణాచల్‌ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌లో భాగంగా చైనా పేర్కొంటుండగా, దాన్ని నూటికి నూరుశాతం ఖండిస్తోన్న భారత్.. అరుణాచల్.. భారత్ లో అంతర్భాగమని చైనాను పలు మార్లు హెచ్చరించింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+