వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘సారీ’ చెప్పాలి: భారత్‌పై చైనా దురంహకారం, ‘డ్రోన్ ఎలా వచ్చింది?’

|
Google Oneindia TeluguNews

బీజింగ్‌: చైనా మీడియా భారత్‌పై మరోసారి తన దురంహకారాన్ని చాటుకుంది. ఇటీవల భారత్‌కు చెందిన ఓ మానవరహిత వాహనం(డ్రోన్‌) చైనా భూభాగంలో కూలిపోయిన విషయం తెలిసిందే. దీనిపై భారత్ వివరణ ఇచ్చినప్పటికీ.. భారత్‌ కావాలనే డోక్లాం ప్రతిష్టంభన జరిగిన ప్రదేశంలో డ్రోన్‌ను ఉపయోగించిందని చైనా ఆరోపిస్తోంది.

పాక్‌కి వెళ్లి నా అంతానికి సుపారీ ఇచ్చారు: అయ్యర్‌పై మోడీ సంచలనంపాక్‌కి వెళ్లి నా అంతానికి సుపారీ ఇచ్చారు: అయ్యర్‌పై మోడీ సంచలనం

నా తల్లిదండ్రులెవరని ప్రశ్నిస్తోందీ సిగ్గులేని కాంగ్రెస్: మోడీ నిప్పులునా తల్లిదండ్రులెవరని ప్రశ్నిస్తోందీ సిగ్గులేని కాంగ్రెస్: మోడీ నిప్పులు

దీనిపై చైనా మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ ఓ దురంహకార కథనాన్ని ప్రచురించింది. చైనా భూభాగంలోకి డ్రోన్‌ చొరబడినందుకు భారత్‌ తప్పకుండా క్షమాపణలు చెప్పాలంటూ టైటిల్‌ పెట్టి కథనాన్ని ప్రచురించింది.

 క్షమాపణ చెప్పాల్సిందే..

క్షమాపణ చెప్పాల్సిందే..

‘కొద్ది నెలల క్రితం సిక్కిం సెక్టార్‌లోని డోక్లాం సరిహద్దు విషయంలో భారత్‌-చైనా మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ప్రాంతంలోకి భారత్‌ డ్రోన్‌ వచ్చింది. ఆ ప్రాంతం చాలా సున్నితమైనది, ఇరుదేశాలు అక్కడ ఎటువంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదని ముందుగానే ఒప్పందం చేసుకున్నాయి. కానీ, భారత్‌ మాత్రం అలా ప్రవర్తించలేదు. ఇందుకు భారత్‌ క్షమాపణలు చెప్పాలి' అని గ్లోబల్‌ టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది.

 సమస్య ఎందుకు వచ్చింది?

సమస్య ఎందుకు వచ్చింది?

‘సాంకేతిక సమస్య కారణంగానే డ్రోన్‌ వచ్చిందని భారత్‌ చెబుతోంది. అయితే.. గతంలో ఎక్కడైతే వివాదం నెలకొందో.. కచ్చితంగా అక్కడికి వచ్చినపుడే డ్రోన్‌కు సాంకేతిక సమస్య ఎందుకు వచ్చింది?' అని ప్రశ్నించింది.

 మేం చేస్తే ఊరుకుంటారా?

మేం చేస్తే ఊరుకుంటారా?

‘చైనా డ్రోన్‌ అదే విధంగా భారత భూభాగంలోకి వెళితే వాళ్లు వూరుకుంటారా? మేము సాంకేతిక సమస్య కారణంగానే డ్రోన్‌ వచ్చిందంటే భారత్‌ దాన్ని అంగీకరిస్తుందా'? అని చైనా మీడియా నిలదీసింది.

 భారత్ వివరణ ఇచ్చినా..

భారత్ వివరణ ఇచ్చినా..

కాగా, గురువారం భారత్‌కు చెందిన డ్రోన్‌ చైనా గగనతలంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. సాంకేతిక కారణాల వల్ల డ్రోన్‌కు గ్రౌండ్‌ కంట్రోల్‌ విభాగంతో సంబంధాలు కోల్పోయింది. దీంతో సిక్కిం సెక్టార్‌ వద్ద వాస్తవాధీన రేఖను దాటింది. దీని గురించి చైనా దళాలకు ముందుగానే సమాచారం ఇచ్చామని భారత్‌ ఇప్పటికే వివరణ ఇచ్చింది. అయినా కూడా, చైనా మాత్రం భారత్‌ తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని చెప్పుకురావడం గమనార్హం.

English summary
The Indian drone that “intruded” and crashed in Chinese territory did so in the Doklam sector near the Sikkim boundary — the same location where border troops of both the countries were involved in a long and tense military standoff earlier this year — Chinese state media said on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X