"భారత్ నన్ను చూసి వణుకుతోంది": పాక్ ఆర్మీ అండతో లష్కర్ కసాయి గర్జన!

పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా డిప్యూటీ చీఫ్, పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సైఫుల్లా కసూరీ మరోసారి భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థానీ సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఉన్న విడదీయలేని సంబంధాన్ని తన వ్యాఖ్యల ద్వారా అతడు బహిర్గతం చేశాడు. ఆ లోతైన సంబధాన్ని అతడు బహిరంగంగానే అంగీకరించడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

పాక్ పాఠశాలలో ఉగ్రవాది ప్రసంగం
ఇటీవల పాకిస్థాన్‌లోని ఒక పాఠశాలలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన కసూరీ, ఇండియాపై ద్వేషాన్ని నూరిపోశాడు. "పాకిస్థాన్ సైన్యం నన్ను గౌరవంగా ఆహ్వానిస్తుంది. మరణించిన పాక్ సైనికుల అంతిమ సంస్కారాల్లో ప్రార్థనలు (నమాజ్) నిర్వహించడానికి నన్ను పిలుస్తారు. భారత్ కూడా నన్ను చూసి భయపడుతోంది" అంటూ అతడు అహంకారపూరిత వ్యాఖ్యలు చేశాడు. చిన్న పిల్లల మనసుల్లో చిన్నతనం నుంచే తీవ్రవాదాన్ని నింపేలా అతడు చేసిన ఈ ప్రసంగంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

India Fears Me Lashkar Terrorist Saifullah Kasuri Shocking Claims with Pakistan Army Backing

సైన్యం - ఉగ్రవాదం.. ఒకే నాణేనికి రెండు ముఖాలు
పాక్ సైన్యానికి ఉగ్రవాదులతో ఎటువంటి సంబంధం లేదని ఆ దేశం అంతర్జాతీయ వేదికలపై ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ.. కసూరీ వ్యాఖ్యలతో ఆ అబద్ధం మరోసారి బట్టబయలైంది. ఉగ్రవాదులు సైనికుల అంతిమ సంస్కారాల్లో పాల్గొనడం, సైన్యం వారిని అధికారికంగా ఆహ్వానించడం చూస్తుంటే.. భారత్‌కు వ్యతిరేకంగా పాక్ సైన్యం, ఉగ్రవాద సంస్థలు కుమ్మక్కయ్యాయని స్పష్టమవుతోంది. భారత్ ఎప్పటి నుంచో చెబుతున్న 'స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం' (ప్రభుత్వ ప్రోత్సాహంతో నడిచే ఉగ్రవాదం) నిజమేనని కసూరీ మాటలు నిరూపిస్తున్నాయి.

భారత్ వైపు మళ్లీ కుట్రలు?
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన "ఆపరేషన్ సింధూర్" వల్ల లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్ వంటి సంస్థలు భారీగా దెబ్బతిన్నాయి. అయితే తాజా ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం.. ఆ నష్టం నుంచి కోలుకోవడానికి ఈ సంస్థలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నిధుల సేకరణ, కొత్త ఉగ్రవాదుల రిక్రూట్మెంట్ ద్వారా భారత్‌పై మరోసారి దాడులు చేసేందుకు అవి కుట్రలు పన్నుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+