Moderna: భారత్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ భారీ ఆఫర్: కేంద్రం నిర్ణయమేంటీ?

జెనీవా: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దేశంలో ముమ్మరంగా సాగుతోంది. 40 కోట్ల మందికి పైగా ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్నారు. మొదట్లో కనిపించిన వ్యాక్సిన్ల కొరత ఇప్పుడు ఉండట్లేదు. రాష్ట్రాల్లో నెలకొన్న డిమాండ్‌కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ డోసులను సరఫరా చేస్తోంది.

రాష్ట్రాలన్నింటికీ ఉచితంగా వాటిని అందించే బాధ్యతను తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దీనికి అయ్యే ఖర్చును భరిస్తోంది. రెండో డోసు వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచిన తరువాత వ్యాక్సినేషన్ కార్యక్రమం పట్టాలెక్కింది.. సజావుగా సాగుతోంది.

మోడెర్నా రెడీ..

మోడెర్నా రెడీ..

ప్రస్తుతం కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్, హైదరాబాద్‌కు చెందిన ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ను విస్తృతంగా వినియోగమౌతోంది.

అదే సమయంలో రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను పరిమితంగా వినియోగిస్తోన్నారు. కొన్ని డిజిగ్నేటెడ్ ఆసుపత్రుల్లో మాత్రమే ఈ వ్యాక్సిన్‌ను తీసుకునే వీలు ఉంది. కేంద్ర ప్రభుత్వం మోడెర్నా వ్యాక్సిన్ వినియోగానికి కూడా అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన క్లినికల్ డేటాను పరిశీలించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆఫర్ ఇదీ..

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆఫర్ ఇదీ..

ఈ దశలో ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌కు భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఏడున్నర మిలియన్ డోసుల మోడెర్నా వ్యాక్సిన్‌ను అందజేస్తామని తెలిపింది. దీనికి సంబంధించిన కొంత పరిహారాన్ని భారత్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ఆసియా విభాగాధిపతురాలు డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవాక్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ప్రోగ్రామ్ కింద పేద దేశాలకు కరోనా వైరస్ వ్యాక్సిన్లను అందజేస్తోంది. ఇందులో భాగంగా భారత్‌కు ఏడున్నర మిలియన్ డోసుల మోడెర్నా వ్యాక్సిన్ అందజేస్తామని పూనమ్ ఖేత్రపాల్ సింగ్ పేర్కొన్నారు.

పరిహారం చెల్లిస్తేనే..

పరిహారం చెల్లిస్తేనే..

మోడెర్నా వ్యాక్సిన్ డోసుల పరిహారాన్ని చెల్లించే స్థోమత ఉన్నందునే ఈ క్లాజ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ ముందుంచినట్లు తెలుస్తోంది. నిజానికి- మోడెర్నా వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకోవడానికి అవసరమైన అనుమతులను దేశీయ ఫార్మాసూటికల్స్ దిగ్గజం సిప్లాకు జారీ చేసింది. ప్రస్తుతం మోడెర్నా వినియోగానికి అవసరమైన ప్రక్రియ డీసీజీఐ పరిశీలనలో ఉంది. అదే సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఏడున్నర మిలియన్ డోసుల మోడెర్నా వ్యాక్సిన్‌ను అందజేయడానికి ముందుకొచ్చింది.

ఫైజర్‌పై డౌట్..

ఫైజర్‌పై డౌట్..

ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించినా.. డ్రగ్ కంట్రోలర్ జనరల్ అనుమతి ఇచ్చినా ఫైజర్ కంపెనీ యాజమాన్యం మాత్రం మొండికేసినట్టే కనిపిస్తోంది. భారత్‌లో ఎంట్రీ ఇవ్వడానికి ఏ మాత్రం ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. అత్యవసర వినియోగానికి అనుమతి ఇస్తామంటూ డీసీజీఐ ఒకటి కాదు..రెండుసార్లు ఫైజర్ యాజమాన్యానికి లేఖలు రాసింది. దీనికి అవసరమైన దరఖాస్తులను దాఖలు చేసుకోవాలంటూ సూచించింది. అయినప్పటికీ- ఫైజర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీనితో- భారత్‌కు వ్యాక్సిన్‌ను సరఫరా చేయడానికి ఫైజర్ ఆసక్తిగా లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+