మద్యంపై 150 శాతం ట్యాక్సా- ఇన్నేళ్లు దోచుకున్నది చాలదా: భారత్‌పై ట్రంప్ భగ్గు

Trump Tariff: భారత్, అమెరికాపై ఈ మధ్యకాలంలో చర్చల్లో ఉన్న అంశం- టారిఫ్. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటోన్న వస్తువులపై అత్యధికంగా పన్నులను విధించడాన్ని అమెరికా తప్పు పడుతూ వస్తోంది. భారత్ ఇష్టానుసారంగా టారిఫ్‌ను విధిస్తోందంటూ ఆరోపిస్తోంది.

భారత్ సహా ట్రంప్ టారిఫ్‌ను ఎదుర్కొంటోన్న దేశాల్లో కెనడా, మెక్సికో, చైనా ఉన్న విషయం తెలిసిందే. ఈ నాలుగు దేశాలపైన సరికొత్త టారిఫ్‌ను ఆయన కిందటి నెలలో ప్రకటించారు. ఈ క్రమంలో మెక్సికోపై అత్యధికంగా టారిఫ్ భారం పడింది. 25 శాతం టారిఫ్‌ను అదనంగా చెల్లించాల్సి వచ్చింది. కెనడా, చైనాలపై 10 శాతం మేర టారిఫ్‌ను విధించింది అమెరికా.

భారత్‌‌పై విధించిన టారిఫ్.. ఏప్రిల్ 2వ తేదీ నుంచి అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఇదివరకు వార్తలొచ్చాయి. అమెరికా విధించిన కొత్త టారిఫ్ వల్ల భారత్‌పై సంవత్సరానికి ఏకంగా ఏడు బిలియన్ డాలర్ల మేర అదనపు భారం పడే ప్రమాదం ఉందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటోందనే అంశం చర్చనీయాంశమైంది.

Liquor

ఈ పరిస్థితుల మధ్య డొనాల్డ్ ట్రంప్ తాజాగా వైట్‌హౌస్‌ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లేవిట్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వివిధ దేశాలు అమెరికాపై విధిస్తున్న పన్నులపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ విధిస్తోన్న పన్నుల గురించి ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. డొనాల్డ్ ట్రంప్ పరస్పర వాణిజ్య విధానాలను విశ్వసిస్తారని, పరస్పరం ప్రయోజనకరంగా ఉండేలా టారిఫ్ వ్యవస్థ అవసరమని చెప్పారు.

కెనడా కూడా దశాబ్దాల కాలంగా అమెరికాను దోచుకుంటోందని, దారుణమైన టారిఫ్ రేటుతో అమెరికన్లను మోసం చేస్తోందని ఆమె ఆరోపించారు. భారత్, జపాన్ వంటి దేశాలు తమ దేశ ఉత్పత్తులపై విధించిన పన్నుల గురించి లేవిట్ క్షుణ్నంగా వివరించారు.

అమెరికన్ ఛీజ్, బటర్‌పై కెనడా దాదాపు 300 శాతం పన్ను విధించిందని వివరించారు. తమదేశ మద్యంపై భారత్ 150 శాతం టారిఫ్‌ను వసూలు చేస్తోందని తెలిపారు. కెంటకీ బౌర్బన్ భారత్‌కు ఎగుమతి చేయడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందని తాను అనుకోవట్లేదని అన్నారు. అలాగే- భారతీయ వ్యవసాయ ఉత్పత్తులపై వంద శాతం పన్ను అమలులో ఉందని లేవిట్ చెప్పారు.

బియ్యంపై జపాన్ 700 శాతం పన్ను విధిస్తోందని లెవిట్ పేర్కొన్నారు. ఈ స్థాయిలో టారిఫ్‌ను విధించినప్పుడు అమెరికా వ్యాపార, వాణిజ్య రంగం ప్రయోజనాలు దెబ్బతింటాయని, వాటిపై ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టి సారించారని అన్నారు. పరస్పర ప్రయోజనకారిగా ఉండే వాణిజ్య పద్ధతులను అనుసరించాలని ట్రంప్ కోరుకుంటోన్నారని అన్నారు.

భారత్‌కు ఏదైనా అమ్మడం దాదాపు అసాధ్యం అంటూ గతంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను లెవిట్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధిక పన్నుల వల్ల భారత్‌కు ఏదైనా ఓ వస్తువును విక్రయించడం దాదాపు అసాధ్యంగా మారిందని తేల్చి చెప్పారు. ఇప్పుడు టారిఫ్‌ను తగ్గించడానికి భారత్ అంగీకరించిందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+