‘భారత్ గొప్పగా పని చేస్తోంది, ఎవరూ మాట్లాడరే’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి బయలు దేరిన ఆయన మొట్టమొదటిసారి భారత్ గురించి మాట్లాడారు.
'భారత్ ఎంతో గొప్పగా పనిచేస్తుంది. కానీ ఈ దేశం గురించి ఎవరూ మాట్లాడటం లేదు' అని ఆయన అన్నారు. ఇప్పటివరకు మెక్సికో, చైనా, జపాన్ వంటి దేశాలను బహిరంగంగానే విమర్శించిన ట్రంప్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ గురించి మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు.

'చైనా పనిచేస్తోంది.. భారత్ కూడా పనిచేస్తోంది. అయితే, భారత్ మాత్రం చాలా గొప్పగా పనిచేస్తోంది. కానీ, దీని గురించి ఎవరూ మాట్లాడరు. నేను ఇండియాతోనే పని చేయాలనుకుంటున్నాను. నాకు ఇండియాలోనే ఎక్కువగా పని ఉంటుంది' అని ట్రంప్ చెప్పారు.
అంతేకాకుండా ‘ఇప్పుడంతా అనూహ్యంగా భారత్, చైనాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంత చేసినా అమెరికా గురించి ఎవరు మాట్లాడుకోవడం లేదు. ఇది అమెరికన్లకు చెడువార్తేనని అన్నారు. మన(అమెరికన్లు)కు సరైన గౌరవం దక్కడం లేదు' అన్నారు.












Click it and Unblock the Notifications