వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్ చరిత్రలో భారత్ ముఖ్యం, ఇంకేదో చేయాలి: జుకర్‌బర్గ్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ఫేస్‌బుక్ కంపెనీ చరిత్రలో భారత్‌కు ఓ ప్రత్యేక స్థానముందని ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వ్యాఖ్యానించారు. తమకెంతో ఆదాయాన్ని ఇస్తున్న భారత్‌కు ఇంకెదో చేయాలని ఉందని, తమపై ఉన్న బాధ్యతను నిర్వర్తిస్తామని అన్నారు.

సిలికాన్ వ్యాలీలోని టౌన్ హాలులో ప్రధాని నరేంద్రమోడీతో చిట్ చాట్ కార్యక్రమంలో జుకర్ బర్గ్ భారత్‌లో దాతృత్వ కార్యక్రమాలను చేపట్టాలన్న ఆలోచన ఉందని చెప్పారు. దీంతో పాటు 125 కోట్ల జనాభా కలిగిన భారత్‌లో మరికొంత మందిని ఫేస్‌బుక్‌లోకి తీసుకొస్తామన్నారు.

ప్రశ్నలు సమాధానాల్లో భాగంగా మా నుంచి ఇంకేదో కావాలని మీరు ఆశిస్తూ ఉండొచ్చు. భారత్‌లోని ఫేస్‌బుక్ వినియోగదారుల ద్వారా ఎంతో ఆదాయాన్ని పొందుతున్న మేము అదృష్టవంతులమేనన్నారు. ఈ ఘనతను అందించిన ప్రపంచానికి మంచి చేయాల్సిన బాధ్యత మాపై ఉందని ఆయన అన్నారు.

ఇంటర్నెట్‌లో ఫేస్‌బుక్ సోషల్ మీడియా కంపెనీగా అవతరించడానికి ముందు యాపిల్ కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్ భారత్‌లోని ఆలయాలను దర్శించాల్సిందిగా జుకర్‌బర్గ్‌కు సూచించారట. ఈ విషయాన్ని జుకర్ బర్గ్ స్వయంగా వెల్లడించారు.

దీంతో జుకర్‌బర్గ్ భారత్‌లో నెల రోజుల పాటు పర్యటించానని చెప్పుకొచ్చారు. అక్కడి ప్రజలు ఎంత దగ్గర బంధాన్ని కలిగి ఉంటారో, అదే 10 ఏళ్ల ఫేస్‌బుక్‌లో తాను చేసినట్టు తెలిపారు. కాబట్టి భారత్‌లో దాతృత్వ కార్యక్రమాలకు మరింత డబ్బు వితరణగా ఇవ్వడం, అక్కడి పేదలకు మెరుగైన జీవనానికి దగ్గరయ్యేందుకు కృషి చేస్తామని చెప్పారు.

India is personally very important to the history of our company says Zuckerberg

గతంలో కూడా ఎబోలా వైరస్‌కు ఔషధాన్ని కనుగొనే ప్రయత్నంలో ఉన్న సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఫౌండేషన్‌కు 25 మిలియన్ డాలర్లు అందించామని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఇప్పటికే ఐక్యరాజ్య సమితి, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్లతో కలసి పనిచేస్తున్నామని చెప్పారు.

భారత్ నుంచి పోలియోను పారద్రోలటం తదితర కార్యక్రమాలకు ఫేస్‌బుక్ వేల కోట్లను ఖర్చు పెట్టిందన్నారు. ఇంటర్నెట్ భవిష్యత్తును ఊహించాం కాబట్టే 'నెట్ న్యూట్రాలిటీ'ని తెరపైకి తెచ్చామని, దీనిపై ఇండియాలో ఎంతో చర్చ జరిగిందని అన్నారు.

నెట్ న్యూట్రాలిటీ ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డ జుకర్‌బర్గ్, తన ఆలోచననూ సమర్థించుకున్నారు. "ఓ విద్యార్థిగా ఆలోచించండి. క్లాస్ రూములో ఉచితంగా సమాచారం అందుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఉచిత ఇంటర్నెట్ ఇలాంటి సౌలభ్యాలను దగ్గర చేస్తుంటే ఆపరేటర్లు మాత్రం గగ్గోలు పెడుతున్నా" రని అన్నారు.

English summary
“India is personally very important to the history of our company,” Mr. Zuckerberg told an audience watching the Q&A session at Facebook’s headquarters in California.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X