యుద్ధంతో భారత్ అలెర్ట్.. రికార్డు స్థాయిలో చమురు దిగుమతి.. రోజుకు 20 లక్షల బ్యారెల్స్ భారత్ కు..

పశ్చిమాసియాలో పరిస్థితులు దారుణంగా మారాయి. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఆ దేశాల నుంచి ముడి చమురు, గ్యాస్ దిగుమతులు మరింత క్లిష్టతరంగా మారనున్నాయి. గత 9 రోజులుగా ఇరు దేశాల మధ్య యుద్ధం భీకర స్థాయిలో జరుగుతోంది. అమెరికా ఎంట్రీతో అక్కడి పరిస్థితులు మరింత ప్రమాదకర స్థితికి చేరాయి. దీంతో భారత్ అలెర్ట్ అయింది. ముడి చమురు దిగుమతిని వేగవంతం చేసింది.

ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య భీకర పోరు రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ క్రమంలో ప్రపంచంలోనే చమురు వాణిజ్యానికి కీలకమైన హార్మోజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ క్రమంలో భారత్ కీలక ముందడుగు వేసింది. భారీ స్థాయిలో ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. జూన్ లో భారత్ దిగుమతి చేసుకోవాల్సిన ముడి చమురు సామర్థ్యం భారీగా పెరిగింది. రష్యా నుంచి అధికంగా చమురును కొనుగోలు చేస్తోంది భారత్.

మొన్నటి వరకూ సౌదీ అరేబియా, ఇరాక్ నుంచి ముడి చమురును భారీగా దిగుమతి చేసుకుంది భారత్. కానీ ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితులు అంత సానుకూలంగా లేకపోవడం, మరోవైపు చమురు వాణిజ్యానికి కీలకమైన హార్మోజ్ జలసంధిని మూసి వేస్తామని ఇరాన్ ప్రకటన నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. పశ్చిమాసియా దేశాల నుంచి కాకుండా రష్యా, అమెరికా నుంచి ముడి చమురును అధికంగా దిగుమతి చేసుకుంటోంది.

India on High Alert Amid Israel-Iran War Boosts Russian Oil Imports to 2M Barrels Daily

గత కొద్ది రోజులుగా రష్యా నుంచి రోజుకు 2 నుంచి 2.2 మిలియర్ బ్యారెల్స్ ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. గత రెండేళ్లలో ఇదే అత్యధికం కావడం విశేషం. అంతేకాక ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురు కంటే ఇదే అత్యధికం. మే నెలలో రష్యా నుంచి 1.96 మిలియన్ బ్యారెల్స్ ఒక రోజుకు దిగుమతి చేసుకుంది భారత్.

ఇక అమెరికా నుంచి కూడా భారీ స్థాయిలో చమురు దిగుమతిని పెంచేసింది భారత్. మే నెలలో ఒక రోజుకు అమెరికా నుంచి 2 లక్షల 80 వేల బ్యారెల్స్ ను దిగుమతి చేసుకుంది భారత్. అయితే జూన్ నెలలో ఏకంగా 4 లక్షల 39 వేల బ్యారెల్స్ ఒక రోజుకు దిగుమతి చేసుకుని రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో భారత్ చమురు నిల్వలను ముందుగానే సమర్థవంతంగా పెంచుకుంటున్నట్లు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+