వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియా టాప్: అమెరికా వెళ్తున్న విద్యార్థుల్లో మనవాళ్లే ఎక్కువ.. సర్వేలో వెల్లడి

2015-16సంవత్సరాల్లో చైనా నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల సంఖ్య 3,28,547 కాగా.. 2016-17సంవత్సరాల్లో అది 3,50,755, అంటే 32.5శాతానికి చేరుకుంది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

అమెరికా వెళ్తున్న విద్యార్థుల్లో మనవాళ్లే ఎక్కువ

వాషింగ్టన్: వీసా నిబంధనలు, వలసలపై అమెరికా తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతో సంబంధం లేకుండా భారత్ నుంచి అమెరికాకు ఏటా వలసలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే తిరస్కరణకు గురవుతున్న వీసాల సంఖ్య కూడా పెరుగుతుండటం గమనార్హం.

అమెరికాకు వెళ్తున్న విదేశీ విద్యార్థుల విషయంలో చైనా, ఇండియా ముందు వరుసలో ఉండగా.. గత దశాబ్ద కాలంలో చైనా వీసా తిరస్కరణ సంఖ్య గణనీయంగా తగ్గింది. అదే సమయంలో భారతీయ విద్యార్థుల వీసా తిరస్కరణ సంఖ్య మాత్రం రెండు రెట్లు పెరిగింది. మారుతున్న అమెరికార ధోరణిని ఇది స్పష్టం చేస్తోంది.

ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేష్(ఐఐఈ) నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అమెరికా కేంద్రంగా నడిచే పలు విద్యా సంస్థల సహాయ సహకారంతో సంయుక్తంగా ఈ సర్వే చేపట్టినట్టు తెలుస్తోంది.

గతం కన్నా పెరిగింది

గతం కన్నా పెరిగింది

2017లో 6.8శాతం మంది చైనా విద్యార్థుల వీసాలు అమెరికాలో తిరస్కరణకు గురయ్యాయి. అదే సమయంలో భారతీయ విద్యార్థుల వీసా తిరస్కరణ 12.3శాతం పెరగడం గమనార్హం.అయితే వరుసగా మూడో ఏడాది ఇండియా నుంచే ఎక్కువమంది విద్యార్థులు అమెరికా వెళ్లినట్టు వెల్లడైంది. ప్రాథమికంగా గ్రాడ్యుయేషన్, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) కోసమే ఎక్కువమంది విద్యార్థులు వెళ్తున్నట్టు స్పష్టమైంది.

విద్యార్థుల సంఖ్య:

విద్యార్థుల సంఖ్య:


సర్వే ప్రకారం.. విదేశాల నుంచి అమెరికా వర్సిటీల్లో చేరుతున్న విద్యార్థుల్లో దాదాపు 50శాతం మంది చైనా-ఇండియా నుంచే ఉన్నారు. ఇండియా లాగే చైనా నుంచి కూడా భారీ సంఖ్యలో విద్యార్థులు అమెరికా వర్సిటీల్లో చేరుతున్నారు. అయితే వృద్దిరేటులో మాత్రం ఇండియా చైనాను మించిపోయింది.

2015-16సంవత్సరాల్లో చైనా నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల సంఖ్య 3,28,547 కాగా.. 2016-17సంవత్సరాల్లో అది 3,50,755, అంటే 32.5శాతానికి చేరుకుంది.అదే సమయంలో ఇండియా నుంచి అమెరికా వెళ్తున్న విద్యార్థుల సంఖ్య 165,918 నుంచి 186,267కి చేరుకుంది. అంటే 17.3శాతంగా నమోదైంది.

 ఆటంకాలు

ఆటంకాలు


వీసా ప్రక్రియల్లో తలెత్తిన సమస్యలు లేదా వీసా నిరాకరణ కారణంగా 2017లో ఇండియా నుంచి అమెరికా వెళ్లాలనుకున్న కొంతమంది విద్యార్థులకు నిరాశ తప్పలేదు. వీసా నిరాకరణతో 2016లో 33.8శాతం మంది భారతీయ విద్యార్థులకు అమెరికా వెళ్లకుండా బ్రేక్ పడగా.. 2017లో అది 68.4శాతంగా నమోదైంది.

వీసా భంగపాటుతో యూనవర్సిటీలు(82శాతం), మాస్టర్స్ కాలేజీలు, కమ్యూనిటీ కాలేజీల్లో(72శాతం) భారతీయ విద్యార్థులకు చుక్కెదురైంది. వీసా కష్టాలకు తోడు ఆ స్థాయి సామర్థ్యం లేకపోవడం వల్ల కూడా చాలామంది అమెరికాలో అడుగుపెట్టడమే ఆలస్యం తిరిగి వెనక్కి వెళ్లిపోతున్నారని సర్వే పేర్కొంది. అలా 2016లో 4.6శాతం మంది విద్యార్థులు, 2017లొ 31.6శాతం మంది విద్యార్థులు వెనక్కి వెళ్లినట్టు తెలిపింది.

దేశాలవారీగా వివరాలు:

దేశాలవారీగా వివరాలు:

ఇండియా 12.3శాతం, చైనా 6.8శాతం వృద్దిరేటుతో ముందు వరుసలో ఉండగా వియత్నాం 4.8శాతం వృద్దిరేటుతో ఆ తర్వాతి స్థానంలో ఉంది. అలాగే వెస్ట్ ఆసియా, నార్త్ ఆఫ్రికా, ఆసియా నుంచి కూడా విద్యార్థుల వలసలు పెరిగాయి.

చాలావరకు అమెరికా ఇనిస్టిట్యూషన్స్ మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికా (75.9శాతం) విద్యార్థులను చేర్చుకోవడానికి సానుకూలంగా ఉన్నాయని సర్వే తెలిపింది. ఆసియా నుంచి (చైనా ఇండియా మినహా) 70శాతం మంది, చైనా (70.9శాతం), ఇండియా (67.8)శాతం విద్యార్థులను చేర్చుకుంటున్నాయి.

English summary
Despite a stricter immigration regime under United States of America president Donald Trump, the fall of 2017 has seen India post the largest growth in a number of students being sent to the US for studies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X