మరో ప్రఖ్యాత పురస్కారం అందుకున్న ప్రధాని మోడీ..
భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా మారిషస్ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు మారిషస్ దేశ అత్యున్నత జాతీయ పురస్కారం ప్రదానం చేశారు. ఈ విశిష్ట పురస్కారాన్ని తాను వినమ్రంగా స్వీకరిస్తున్నానని మోడీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అంతే కాకుండా మారిషస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మారిషస్ సోదర సోదరీమణులందరికీ తన హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ సందేశం ఇచ్చారు. ఇది తన ఒక్కడికి లభించిన పురస్కారం కాదని.. 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు.
మరోవైపు ప్రధాని పర్యటనలో భాగంగా మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్‌లో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో మోడీ ప్రసంగించారు. భారత్, గ్లోబల్ సౌత్‌కు మధ్య మారిషస్ ఒక వారధి అని కొనియాడారు. మారిషస్ అనేది భాగస్వామ్య దేశం మాత్రమే కాదని.. భారతదేశ కుటుంబంలో ఓ భాగమని వ్యాఖ్యానించారు. మారిషస్ మినీ ఇండియా అని అభివర్ణించారు. అలానే మారిషస్ జాతిపిత సీఓసాగర్ రామ్ గులాం పేరు మీదుగా బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేశారు.

ఈ మేరకు ప్రధాని మోదీ ఆ గార్డెన్‌ను సందర్శించారు. అనంతరం సీఓగులాం రామ్‌గులాంతో పాటు ఆ దేశాధ్యక్షుడు అనిరుద్ధ్ జగన్నాథ్ సమాధుల వద్ద మోడీ నివాళులర్పించారు. ఈ మేరకు మారిషస్ దేశ ప్రధానితో కలిసి పీఎం మోడీ మొక్కలు నాటారు. ఇక మొదటి రోజు పర్యటనలో భాగంగా పోర్ట్ లూయిస్ లో మోడీకి ఘన స్వాగతం లభించింది. మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గులామ్ స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చి భారత ప్రధానికి స్వాగతం పలికారు.
Honoured to be conferred the Grand Commander of the Order of the Star and Key of the Indian Ocean, and that too on Mauritius’ National Day. pic.twitter.com/LaaurcKbzx
— Narendra Modi (@narendramodi) March 12, 2025












Click it and Unblock the Notifications