వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2వ దశ ట్రయల్స్‌కు సిద్ధమైన కోవాక్సిన్ : సైడ్‌ఎఫెక్ట్స్ లేని భారత తొలి కరోనా వ్యాక్సిన్‌గా రికార్డ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత దేశీయ కరోనా వ్యాక్సిన్ 'కోవాక్సిన్' ప్రస్తుతం ఆస్పత్రుల వద్ద రెండో దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధమైందని సంబంధిత అధికారులు తెలిపారు. మొదటి దశ ట్రయల్స్ ఇప్పటికీ కొనసాగుతన్నప్పటికీ.. రెండో దశ ట్రయల్స్ కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎస్‌యూఎమ్ ఆస్పత్రి ప్రిన్సిపల్ ఇన్వెస్టర్, మెడికల్ సైన్సెస్ ఫ్యాకల్టీ డాక్టర్ ఈ వెంకట రావు చెప్పారు.

Recommended Video

Covaxin Human Trials News: Bharat Biotech's Coronavirus Vaccine ధరపై గుడ్ న్యూస్..!! || Oneindia
సైడ్‌ఎఫెక్ట్స్ లేని తొలి వ్యాక్సిన్ ఇదే..

సైడ్‌ఎఫెక్ట్స్ లేని తొలి వ్యాక్సిన్ ఇదే..

ఎవరైతే కోవ్యాక్సిన్ తీసుకున్నారో.. వారిలో యాంటీబాడీలు ఏ మేరకు వృద్ధి చెందాయనేదాన్ని పరిశీలించేందుకు వారి నుంచి రక్త నమూనాలను సేకరించామని డాక్టర్ వెంకటరావు తెలిపారు. ఈ పరిశీలనలో కోవాక్సిన్ వారిలో ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ కలిగించలేదని తేలిందని ఆయన వెల్లడించారు. ట్రయల్స్‌లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూపని తొలి వ్యాక్సిన్ కోవాక్సిన్ అని ఆయన తెలిపారు.

హైదరాబాద్ భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సినే..

హైదరాబాద్ భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సినే..

హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను ట్రయల్స్ చేసేందుకు దేశంలోని 12 మెడికల్ సెంటర్లను ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఎంపిక చేసింది. ఈ పన్నెండింటిలో ఐఎంఎస్, ఎస్‌యూఎం ఆస్పత్రి కూడా ఉన్నాయి. మూడు నుంచి ఏడు రోజులపాటు స్క్రీనింగ్ చేసిన తర్వాత ఒక్కో వాలంటీర్‍‌కు రెండు డోసులను వేసినట్లు డాక్టర్ వెంకటరావు తెలిపారు. మొదటి డోసు ఇచ్చిన తర్వాత వారి నుంచి రక్త నమూనాలు సేకరించామని, ఆ తర్వాత 14 రోజులకు మరో డోసు ఇచ్చి.. ఆ తర్వాత మరోసారి రక్తపు నమూనాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం సంప్రదించండి..

వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం సంప్రదించండి..

28,42,104, 194 రోజులకు వాలంటీర్ల నుంచి రక్త నమూనాలను సేకరించినట్లు ఆయన చెప్పారు. ఈ క్రమంలో చాలా మంది రెండో దశ ట్రయల్స్‌లో భాగస్వాములు అయ్యేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని ఆయన తెలిపారు. ట్రయల్‌లో భాగస్వాములు కావాలనుకునేవారు http://ptctu.soa.ac.inని సంప్రదించవచ్చని తెలిపారు.

దేశంలో వివిధ దశల్లో ఏడు కరోనా వ్యాక్సిన్లు కానీ.. రెండింటికే..

దేశంలో వివిధ దశల్లో ఏడు కరోనా వ్యాక్సిన్లు కానీ.. రెండింటికే..

దేశంలో సుమారు ఏడు యాంటీ కరోనా వ్యాక్సిన్లు వివిధ దశలలో అభివృద్ధి చెందుతున్నాయి. రెండు వ్యాక్సికన్లకు మాత్రం హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు డ్రగ్ రెగ్యూలేటర్స్ నుంచి అనుమతి లభించింది. కాగా, దీపావళి వరకు దేశంలో కరోనా నియంత్రణలోకి వస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.

English summary
Preparations are underway at a hospital here for the commencement of the second phase of human clinical trial of 'Covaxin', India's indigenous COVID-19 vaccine, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X