చైనాకు ఇండియా షాక్: దక్షిణ చైనా సముద్రంలో ఇండియా మిస్సైల్
దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనాకు భారత్ షాకిచ్చింది.భారతీయ క్షిపణులు చైనాకు సవాల్ విసిరాయి.వియత్నాంకు భారత్ మిస్సైల్స్...
న్యూఢిల్లీ: దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదే అంటున్న చైనాకు భారత్ షాకిచ్చింది. దక్షిణ చైనా సముద్రంపై భారతీయ క్షిపణులు చైనాకు సవాల్‌గా మారాయి.
వాస్తవానికి దక్షిణ చైనా సముద్రంపై బ్రూనై, మలేషియా, ఇండోనేషియా ఫిలిఫ్పెన్స్, వియత్నాంలకు కూడ అధికారాలున్నాయి. అయితే చైనా మిగిలిన దేశాలను బెదిరిస్తూ సముద్రం మొత్తం తమ కిందకే వస్తోందని వాదిస్తోంది.
దక్షిణ చైనా సముద్ర తీరం కలిగిన వియత్నాంతో భారత్‌కు ఎప్పటినుండో స్నేహసంబంధాలున్నాయి. ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసేలా వియత్నాంకు ఓడలపై నుండి ప్రయోగించే అత్మధిక శక్తివంతమైన మిస్సైల్స్ బ్రహ్మెస్‌ను అందించింది.

కొన్నేళ్ళుగా భారత్-వియత్నాంల మధ్య ఈ మిస్సైల్ అమ్మకానికి చర్చలు జరుగుతున్నాయి. చైనా భారత్‌పై కవ్వింపు చర్యలకు దిగుతుండడంతో భారత్ ఈ మిస్సైల్స్‌ను వియత్నాంకు ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భారత నేవీ వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన మిస్సైల్ బ్రహ్మోస్ ధ్వని వేగం కంటే రెండున్నర రెట్టు అధిక వేగంతో ప్రయాణించగల సామర్థ్యం దీని స్వంత ఓడల నుండి సులువుగా ప్రయోగించే అవకాశం దక్కుతోంది.
ప్రపంచదేశాల వద్ద ఉన్న ఈ తరహ మిస్సైల్స్‌లో బ్రహ్మోస్ అత్యాధునికం, భారత్ నుండి తొలి విడతగా అందాల్సిన బ్రహ్మోస్ మిస్సైల్స్ తమ వద్దకు చేరుకొన్నట్టు వియత్నాం అధికారి తెలిపారు. అయితే బ్రహ్మోస్ క్షిపణుల అమ్మకంపై భారత్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications