పాకిస్తాన్ మిత్రదేశాలకు భారత్ బిగ్ షాక్- ఆ పత్రంపై సంతకానికి నో..!
భారత్ లోని పహల్గాంలో ఈ ఏడాది జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి కారణంగానే భారత్ పాకిస్తాన్ పై యుద్దం ప్రకటించి ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడిని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూ వస్తున్న భారత్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
చైనాలోని క్వింగ్ డావోలో షాంఘై సహకార సంస్థ సదస్సు జరుగుతోంది. ఇందులో సభ్య దేశాలైన భారత్, రష్యా,పాకిస్తాన్, ఇరాన్, కిర్గిస్దాన్, కజకిస్తాన్, తజకిస్తాన్, బెలారస్, ఉజ్బెజిస్తాన్ పాల్గొంటున్నాయి. ఈ సదస్సులో ప్రవేశపెట్టిన తీర్మానంలో పహల్గాం ఉగ్రదాడిని ప్రస్తావించలేదు. అదే సమయంలో పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ లో జరుగుతున్న దాడుల్ని మాత్రం ప్రస్తావించారు. ఈ పత్రంపై సభ్య దేశాలన్నీ సంతకం చేసాయి. కానీ భారత్ మాత్రం నిరాకరించింది.

భారత్ లోని కశ్మీర్లో 26 మంది ప్రాణాలు తీసేందుకు కారణమైన పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఈ పత్రంలో ఎలాంటి ప్రస్తావన చేయకపోవడంతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దీనిపై సంతకం చేసేందుకు నిరాకరించారు. తద్వారా ఈ దాడికి అండగా ఉన్న పాకిస్తాన్ తో పాటు దాని మిత్రదేశాలు చైనా, రష్యా, ఇతర దేశాలకూ షాక్ ఇచ్చినట్లయింది. పహల్గాం దాడి విషయంలో ఇప్పటికే అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో పర్యటించిన అఖిలపక్ష బృందాలు పాకిస్తాన్ వైఖరిని ఎండగట్టాయి.
#WATCH | Qingdao, China | At the SCO Defence Ministers' meeting, Defence Minister Rajnath Singh says, "Any acts of terrorism are criminal and unjustifiable regardless of their motivation whenever, wherever and by whom-so-ever committed. SCO members must condemn this evil… pic.twitter.com/62cdoXbKri
— ANI (@ANI) June 26, 2025
ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. సామూహిక భద్రత కోసం ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ఎస్సీవో సభ్యులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు శాంతి, భద్రత, విశ్వాస లేమే అన్నారు. ఈ సమస్యలకు మూలకారణం ఉగ్రవాదీకరణ అన్నారు. ఉగ్రవాద గ్రూపుల చేతుల్లో సామూహిక విధ్వంసక ఆయుధాల విస్తరణతో ఇతరులు సహజీవనం చేయలేరన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి నిర్ణయాత్మక చర్యలు కావాలన్నారు.
ఉగ్రవాదాన్ని నడిపించే, పెంచే, తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే వారు దాని పరిణామాలను భరించడం అత్యవసరమని తేల్చేశారు. అలాగే పహల్గామ్ ఉగ్రవాద దాడిని ప్రస్తావిస్తూ... ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమను తాము రక్షించుకోవడానికి, ముందస్తుగా, తదుపరి దాడులను నిరోధించడానికి భారత్ తన హక్కును వాడుకుందన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి సమయంలో బాధితులను మతపరమైన గుర్తింపు అడిగి మరీ కాల్చి చంపారని గుర్తుచేశారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications