ట్రంప్ టారిఫ్ పై స్పందించిన భారత్.. తగ్గేదేలే..షాకింగ్ నిర్ణయం..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ వస్తువులపై 25 శాతం టారిఫ్ లు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ టారిఫ్ లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. భారత్.. రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్నందుకు ట్రంప్ టారిఫ్ లు విధించారు. అయితే అమెరికా చర్యపై తాజాగా భారత్ స్పందించింది. భారత సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని.. దేశ భద్రతే తమ ప్రధమ కర్తవ్యం అని తెలిపింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోబోతున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది.

భారత్ పై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం టారిఫ్ విధించారు. భారత్ వస్తువులపై 25 శాతం పన్ను విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భారత్ తాజాగా స్పందించింది. ఈ మేరకు కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ట్రంప్ విధించిన 25 శాతం టారిఫ్ లు భారత్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ప్రస్తుతం స్టడీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సామరస్యంగా, నిజాయితీగా చర్చలు జరుపుతోందని పేర్కొంది. దేశ ప్రయోజనాలను కాపాడుకుంటామని కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ శాఖ పేర్కొంది. బ్రిటన్ తో ఇటీవల ఎఫ్ టీఏ కుదుర్చుకున్న నేపథ్యంలో జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.

India Stands Firm Vows to Protect Interests Against Trump s 25 Tariff

ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యాతో వాణిజ్యం చేస్తున్న ప్రతి దేశంపై అధిక సుంకాలు విధిస్తామని ఇదివరకే ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. ఈ మేరకు భారత్, చైనాలకూ వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేయడం ఆపేయాలని అన్నారు. మరోవైపు అమెరికా వస్తువులపై భారత్ అధిక సుంకాలు విధిస్తోందని ట్రంప్ అన్నారు. భారత్ మిత్ర దేశమైనా సుంకాలు అధికంగా ఉన్నందున వారితో పరిమిత స్థాయిలోనే వ్యాపారాలు చేస్తున్నామని తెలిపారు. ఇక తాజాగా విధించిన 25 శాతం టారిఫ్ లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ వేదికగా స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+