అమెరికా భయంతో ఇరాన్ కు భారత్ బిగ్ షాక్...!

ఇరాన్ లో తాజాగా ఖమేనీ ప్రభుత్వంపై వెల్లువెత్తిన నిరసనల్ని సొమ్ము చేసుకుని అక్కడ ప్రభుత్వాన్ని మార్చేసేందుకు పావులు కదుపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అదే సమయంలో ఇరాన్ మిత్రదేశాలకూ మరో కీలక హెచ్చరిక కూడా చేశారు. ఇరాన్ మిత్రదేశాలకు ట్రంప్ చేసిన ఆ హెచ్చరిక భారత్ వంటి దేశంపై బాగా పనిచేసినట్లుంది. దీని ప్రభావంతో భారత్ ఇవాళ అనూహ్యంగా తమ మిత్రదేశమైన ఇరాన్ కు బిగ్ షాక్ ఇచ్చింది.

ఇరాన్ తో వ్యాపారం చేసే దేశాలపై మరో 25 శాతం అదనపు సుంకాలు విధిస్తానంటూ ట్రంప్ తాజాగా హెచ్చరికలు చేశారు. దీంతో ఇప్పటికే ఇరాన్ లో చబహార్ పోర్టు నిర్మిస్తున్న భారత్ కూడా ఉలిక్కిపడింది. ఇప్పటికే రష్యా ఆయిల్ కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్దానికి ఆజ్యం పోస్టుందన్న ఆరోపణలతో 50 శాతం సుంకాలు ఎదుర్కొంటున్న భారత్ కు ట్రంప్ తాజా హెచ్చరిక తలనొప్పిగా మారింది. ఇరాన్ తో కలిసి పనిచేస్తే మరో 25 శాతం సుంకాలు ట్రంప్ విధించే ప్రమాదం ఉండటంతో ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది.

India Steps Back from Iran s Chabahar Port Over US Sanctions Scare

ఇరాన్ లో వ్యూహాత్మకంగా కీలకమైన చాబహార్ ఓడరేవు నిర్మాణంలో తన ప్రమేయాన్ని భారత్ తగ్గించడం ప్రారంభించిందని, అమెరికా ఆంక్షల ముప్పు పెరుగుతున్నందున కార్యాచరణ బాధ్యతల నుండి వెనక్కి తగ్గిందని తెలుస్తోంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం భారత్ ఇప్పటికే ఓడరేవు ప్రాజెక్టు కోసం తన వాటా సుమారు $120 మిలియన్లను బదిలీ చేసింది. అయితే ఈ పోర్టుపై గతంలో విధించిన ఆంక్షల్లో ట్రంప్ ఇచ్చిన మినహాయింపు గడువు ఏప్రిల్ 26న ముగుస్తోంది. దీన్ని పునరుద్ధరించకూడదని తాజాగా ట్రంప్ నిర్ణయించారు. దీంతో భారత్ తప్పనిసరిగా ఈ పోర్టు విషయంలో వెనక్కి తగ్గాల్సి వస్తోంది.

India Steps Back from Iran s Chabahar Port Over US Sanctions Scare

జనవరి 13న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకాలను ప్రకటించారు. ఇరాన్ ప్రభుత్వం తమ దేశంలో నిరసనల అణచివేత కారణంగా 2,600 మందికి పైగా చనిపోయినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ట్రంప్ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో చబహార్‌లో భారత్ ప్రయోజనాలను చూస్తున్న ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ (IPGL) ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ప్రభుత్వం నామినేటెడ్ డైరెక్టర్లందరూ ఐజీపీఎల్ బోర్డు నుండి రాజీనామా చేశారని, ఆంక్షల నుండి తమ సిబ్బందిని రక్షించడానికి కంపెనీ ప్రజా కార్యకలాపాలను తగ్గించిందని నివేదికలు చెప్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+