భారత్-అమెరికా వాణిజ్య చర్చలకు బ్రేక్.. వాషింగ్టన్ భేటీ వాయిదా!

India-US Trade Deal: భారత్, అమెరికా దేశాల మధ్య కుదరాల్సిన అత్యంత కీలకమైన వాణిజ్య ఒప్పందంపై ప్రస్తుతానికి నీలినీడలు కమ్ముకున్నాయి. వాషింగ్టన్ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి 3 రోజుల పాటు జరగాల్సిన ఇరు దేశాల ప్రధాన చర్చాకర్తల సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను ఓ కొలిక్కి తెచ్చి, లీగల్ డ్రాఫ్ట్‌ను సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరగాల్సి ఉండగా.. అనూహ్య పరిణామాల నేపథ్యంలో దీనిని రీషెడ్యూల్ చేశారు.

వాయిదా వెనుక అసలు కారణం ఏమిటి?
పీటీఐ నివేదికల ప్రకారం.. ఈ భేటీ వాయిదా పడటానికి ప్రధాన కారణం అమెరికాలో వేగంగా మారుతున్న వాణిజ్య విధానాలేనని తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 'రెసిప్రోకల్ టారిఫ్'విధానంపై అక్కడి సుప్రీంకోర్టులో ప్రతికూల తీర్పు రావడం ఈ చర్చల దిశను మార్చివేసింది. తాజా రాజకీయ, న్యాయపరమైన పరిణామాలన.. వాటి వల్ల కలిగే ఆర్థిక ప్రభావాలను లోతుగా విశ్లేషించడానికి ఇరు దేశాలకు మరింత సమయం అవసరమని చర్చాకర్తలు భావించారు. ఈ నేపథ్యంలోనే పరస్పర అంగీకారంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు సమాచారం.

India-US Trade Deal Talks Postponed Washington Meeting Rescheduled Amid Trump Tariff Surge

ట్రంప్ టారిఫ్ నిర్ణయాల సెగ
అమెరికా సుప్రీంకోర్టు తీర్పు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇచ్చింది. సుంకాల విధింపుపై కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో, అధ్యక్షుడు ట్రంప్ వెంటనే అప్రమత్తమయ్యారు. సెక్షన్ 122ను ఉపయోగించి భారత్ సహా ప్రపంచ దేశాలన్నింటిపై మొదట 10 శాతం గ్లోబల్ టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ నిర్ణయం తీసుకున్న 24 గంటల లోపే ఆ పన్నును ఏకంగా 15 శాతానికి పెంచుతూ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ అనూహ్య మార్పుల వల్ల భారత్ నుంచి జరిగే ఎగుమతులపై భారీ భారం పడే అవకాశం ఉండటంతో, చర్చల కొనసాగింపునకు ముందు వ్యూహాత్మక విశ్లేషణ అవసరమని భారత బృందం భావిస్తోంది.

మార్చి ఒప్పందంపై నీలినీడలు
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గతంలో వెల్లడించిన ప్రకారం.. ఈ కీలక వాణిజ్య ఒప్పందంపై మార్చి నెలలో సంతకాలు జరగాల్సి ఉంది. ఏప్రిల్ నుంచి ఈ ఒప్పందాన్ని అమలులోకి తేవాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే తాజా పరిస్థితులు, వాషింగ్టన్ భేటీ వాయిదా పడటంతో ఈ గడువు మారుతుందా లేదా అనే సందిగ్ధత నెలకొంది. లీగల్ డ్రాఫ్ట్ పూర్తి కాకపోతే ఒప్పందం కుదరడం కష్టమౌతుంది. ట్రంప్ ప్రభుత్వం విధిస్తున్న కొత్త టారిఫ్ నిబంధనలను భారత్ ఏ విధంగా ఎదుర్కోబోతుంది? ఈ ఒప్పందం ద్వారా భారత్ పొందే ప్రయోజనాలు ఏమిటి? అనే అంశాలపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+