బుల్లెట్లు కూడా లెక్కించం: రాజ్, పాక్‌కు షాకిచ్చిన గుజరాత్ రైతులు

న్యూఢిల్లీ: భారత దేశం ఎవరి పైన తనంతట తాను దాడికి పాల్పడదని, కానీ మా పైన దాడికి చేస్తే మాత్రం ప్రతిఘటిస్తామని, ప్రతీకారం తీర్చుకునే క్రమంలో బుల్లెట్లు కూడా లెక్కపెట్టుకోమని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం హెచ్చరించారు.

రాజస్థాన్‌ పర్యటనలో రెండో రోజు ఆయన సరిహద్దు భద్రతను సమీక్షించారు. అనంతరం బీఎస్‌ఎఫ్‌ జవాన్లను ఉద్దేశించి మాట్లాడారు. వసుధైక కుటుంబమంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అనేది మన సంస్కృతి అని, ఇతరుల భూభాగాన్ని ఆక్రమించుకోవాలనే ఉద్దేశం మనకు ఎప్పుడూ లేదన్నారు.

మనం ఎప్పుడూ ముందుగా కాల్పులు జరపలేదని చెప్పారు. మనపై ఎవరైనా దాడికి వస్తే మాత్రం బదులు తీర్చుకునేందుకు తుపాకీ ట్రిగ్గర్‌ నొక్కాక తూటాలను లెక్కించుకోమన్నారు. సరిహద్దు గస్తీ శిబిరాలకు గొట్టపు మార్గం ద్వారా నీటిని అందించడంలో సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామన్నారు.

India Will Retaliate, 'Won't Count Bullets' If Attacked: Rajnath Singh

పాక్ కాల్పుల ఉల్లంఘన

పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. పూంచ్‌ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగడంతో ఓ సైనికుడు గాయపడ్డారు. కృష్ణగతి - మెంధర్‌ సెక్టార్‌లో పాకిస్తాన్ సైన్యం కాల్పులకు దిగినట్లు పోలీసు ఐజీ జానీ విలియమ్స్‌ తెలిపారు.

మన దళాలు సమర్ధంగా తిప్పికొట్టాయన్నారు. రక్షణ శాఖ పీఆర్వో కల్నల్‌ మనీశ్‌ మెహతా మాత్రం కాల్పుల విరమణ ఉల్లంఘనేదీ జరగలేదని చెబుతున్నారు. దక్షిణ కాశ్మీర్‌లోని షోపియన్‌ జిల్లాలో పోలీసు పోస్టుపై దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

పాకిస్తాన్‌కు కూరగాయలు నిలిపివేత

గుజరాత్‌కు చెందిన వ్యాపారులు పాకిస్థాన్‌కు కూరగాయల సరఫరాను నిలిపేశారు. ముఖ్యంగా టమోటా, మిరపను గత రెండు రోజులుగా పంపడం మానేశారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల గుజరాత్‌ రైతులు, కూరగాయల వర్తకులకు రోజుకు సుమారు రూ.3 కోట్ల దాకా నష్టం వాటిల్లుతుంది. డబ్బు కంటే దేశప్రయోజనాలే తమకు ముఖ్యమని వ్యాపారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+