అమెరికాలో భారతీయ వ్యాపారవేత్తపై కాల్పులు: మృతి
న్యూయార్క్: అమెరికాలో ఓ భారతీయ వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం షాపు నిర్వహిస్తున్న అతడిపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
ఎడిసన్‌కు చెందిన అమిత్ పటేల్(28) న్యూజెర్సీలోని ఇర్వింగ్టలోని రోజ్‌వే లిక్కర్స్‌లో సోమవారం హత్యకు గురైనట్లు పోలీసులు చెప్పారు. తన తండ్రికి చెందిన మద్యం షాపులో ఒంటరిగా ఉన్న సమయంలో పటేల్‌పై ఓ దుండగుడు ఒక్కసారిగా దగ్గర్నుంచి కాల్పులు జరపడంతో అక్కడికక్కడే పటేల్ కుప్పకూలిపోయాడు.
ఆ దుండగుడు అతడిపై కాల్పులు జరిపి అక్కడ్నుంచి పారిపోయాడు. ఆ షాపులో డబ్బులు గానీ, ఇతర వస్తువులను గానీ అతడు అపహరించుకుపోలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా, రక్తపు మడుగులో పటేల్ పడిపవున్నాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఘటన జరిగిన సమయంలో అమిత్ పటేల్ తండ్రి షాపు వెనకాల ఉన్న కార్యాలయంలో ఉన్నాడు. షాపులో ఉన్న అమిత్ పటేల్‌ను కొందరు వచ్చి కాల్చి వెళ్లిపోయారని అమిత్ పటేల్ ఫ్యామిలీ ఫ్రెండ్ రాకేష్ పటేల్ తెలిపారు. అమిత్ పటేల్ చాలా మంచి యువకుడని, ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారో తెలియడం లేదని మరో ఫ్యామిలీ ఫ్రెండ్ భీమల్ పటేల్ చెప్పారు.
ఈ ఘటనతో అమిత్ కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనలో కూరుకుపోయారని తెలిపారు. మృతునికి ఏడాది క్రితమే వివాహమైందని చెప్పారు. కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. సిసి కెమెరా ఫుటేజీని పరిశీలించి, నిందితులను తొందరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications