అమెరికా విదేశాంగ శాఖలో భారత సంతతి మనీషాకు కీలక పదవి
వాషింగ్టన్: అమెరికా విదేశాంగ శాఖలో భారత సంతతికి చెందిన మహిళా న్యాయవాది మనీషా సింగ్ కీలక పదవిని చేపట్టారు. యూపీలో జన్మించిన మనీషా ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల సహాయ కార్యదర్శిగా నియమితులైన తొలి మహిళ కావడం గమనార్హం.
ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ ఆమెతో శనివారం ప్రమాణ స్వీకారం చేయించారు. అమెరికా విదేశాంగ శాఖలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న అత్యున్నతస్థాయి భారత సంతతి అధికారి. కొత్త బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో అమెరికా ఆర్థికపరమై దౌత్య వ్యవహారాలకు ఆమె ఇంచార్జిగా ఉంటారు.

ప్రమాణ స్వీకారం అనంతరం ఆమె ట్వీట్ చేశారు. తాము అమెరికా అభివృద్ధిని ప్రమోట్ చేస్తామని, అలాగే మా భవిష్యత్తును సెక్యూర్ చేసుకుంటామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications