అమెరికాలో భార్యను తుపాకీతో కాల్చి చంపిన ఎన్నారై
న్యూయార్క్: అమెరికాలోని తుపాకీ సంస్కృతి అక్కడున్న భారతీయులకు కూడా పాకుతోంది. ఓ ఎన్నారై తన భార్యను గత శనివారం తుపాకీతో కాల్చి చంపేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. శాన్‌జోస్‌లోని ఇండిగో ఓక్ లేన్‌లో నివాసముంటున్న జేమ్స్ నల్లాన్ తన భార్య సోనియా నల్లాన్‌ను గత శనివారం ఇంట్లోనే తుపాకీతో కాల్చాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.

జేమ్స్ వయసు 63 సంవత్సరాలు కాగా, సోనియాకు 48 ఏళ్లు. ఆ సమయంలో వారి ఇద్దరు కుమారులు సాహిల్(21), నితిన్(20) ఇంట్లో లేరు. కాల్పుల శబ్దం రావడంతో పక్కింటివారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జేమ్స్‌ను అరెస్టు చేశారు.
తమ అమ్మ, నాన్న ఎంతో అన్యోన్యంగా ఉండేవారనీ.. ఇలా జరగడానికి కారణమేమిటో అంతుపట్టడం లేదని కుమారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న కాలిఫోర్నియా పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications