కొండచరియలు పడి భారతీయ డాక్టర్ దంపతుల మృతి
కాఠ్మాండు: నేపాల్ లో పదే పదే భూమి కంపించడంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ కొండ చరియలు కిందపడుతాయో అని స్థానికులు భయపడి చస్తున్నారు. కొండ చరియలు కారు మీద పడటంతో ఇద్దరు భారతీయ వైద్యులు దుర్మరణం చెందారు.
డాక్టర్ తరుణ్ దీప్ సింగ్, డాక్టర్ యశోద కొచ్చర్ దంపతులు. తరుణ్ దీప్ కంటి వైద్యు నిపుణుడు. యశోద గైనకాలజిస్ట్ గా పని చేస్తున్నారు. ఇద్దరు నేపాల్ లో నే పని చేస్తున్నారు. బుధవారం సాయంత్రం దంపతులు ఇద్దరు కారులో బుతావల్ నుండి పాల్పా లోని ఆసుపత్రికి బయలుదేరారు.

మార్గం మధ్యలో బైర్వాడా జిల్లాలోని సిద్దబాబా ప్రాంతంలోని లుంబిని జోన్ దగ్గర కొండచరియలు ఒక్క సారిగా వారి కారు మీద కుప్పకూలిపోయాయి. బురద, రాళ్ల దెబ్బకు కారు ధ్వంసం అయ్యి ఇద్దరికి తీవ్రగాయాలైనాయి. విషయం గుర్తించిన స్థానికులు కారు దగ్గరకు వెళ్లారు.
ఇద్దరిని కారులో నుండి బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై తరుణ్ దీప్, యశోద దంపతులు మరణించారని స్థానిక పోలీసులు తెలిపారు. భారత్ లోని దంపతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని సీనియర్ పోలీసు అధికారి గణేష్ తెలిపారు.












Click it and Unblock the Notifications