ఉక్రెయిన్‌లో అనూహ్య పరిణామం: భారత రాయబార కార్యాలయం క్లోజ్: రంగంలో దిగిన గ్లోబ్‌మాస్టర్

కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న యుద్ధం ఏడో రోజుకు చేరుకుంది. మరింత భీకర రూపాన్ని దాల్చింది. రష్యా సైనిక బలగాలు- ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై పూర్తిస్థాయిలో దండెత్తాయి. రాకెట్లు, మిస్సైళ్లతో దాడులను నిర్వహిస్తోన్నాయి. ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులను సంధిస్తోన్నాయి. ఉక్రెయిన్ సైనికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న కొద్దీ.. రష్యా బలగాలు మరింత రెచ్చిపోతున్నాయి. కీవ్‌ను మరింత సమీపించాయి. ఈ నగరాన్ని హస్తగతం చేసుకునే దిశగా కదులుతున్నాయి.

 భారత ఎంబసీ ఖాళీ..

భారత ఎంబసీ ఖాళీ..

కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు ఈ పరిణామాలను ముందుగానే అంచనా వేశారు. ఊహించిన దాని కంటే యుద్ధ తీవ్రత మరింత అధికంగా ఉంటుదని భావించారు. అందుకే కీవ్‌లో నివసిస్తోన్న భారత పౌరులు, విద్యార్థులను తక్షణమే ఖాళీ చేయాలంటూ ఆదేశాలను జారీ చేశారు. కాలం గడుస్తున్న అక్కడి యుద్ధ తీవ్రత పతాక స్థాయికి చేరుకుంటోన్న నేపథ్యంలో- భారత రాయబార కార్యాలయం అధికారులు- తాము కూడా కీవ్‌ను ఖాళీ చేశారు.

ల్వీవ్ నుంచి కార్యకలాపాలు..

ల్వీవ్ నుంచి కార్యకలాపాలు..

భారత రాయబార కార్యాలయాన్ని మరో ప్రాంతానికి తరలించారు. అధికారులందరూ ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతానికి తరలివెళ్లారు. వెస్టర్న్ రీజియన్‌లోని ల్వీవ్ నగరం నుంచి తమ కార్యకలాపాలను కొనసాగిస్తోన్నారు. పోలెండ్ సరిహద్దులకు సమీపంలో ఉంటుందీ ల్వీవ్ సిటీ. తాత్కాలికంగా ల్వీవ్ నుంచే- భారత విద్యార్థుల, పౌరుల తరలింపు కార్యక్రమాలను పర్యవేక్షిస్తోన్నారు. ప్రస్తుతానికి ఉక్రెయిన్‌లో ఈ నగరం ఒక్కటే సురక్షితంగా ఉంటోంది. విదేశీయులందరూ ఇక్కడకే చేరుకుంటోన్నారు.

ఖార్‌కీవ్ ఖాళీకి..

ఖార్‌కీవ్ ఖాళీకి..

ఖార్‌కీవ్‌ నుంచి భారత విద్యార్థులపై తరలింపునకు అధిక ప్రాధాన్యతను ఇస్తోంది విదేశాంగ మంత్రిత్వ శాఖ. వందల సంఖ్యలో భారత విద్యార్థులు ఈ నగరంలో చిక్కుకుని ఉన్నారు. యుద్ధం ఆరోరోజుకు చేరుకున్న సమయంలో ఈ నగరాన్ని నామరూపాల్లేకుండా చేశాయి రష్యా సైనిక బలగాలు. రాకెట్లతో విరుచుకుని పడ్డాయి. దాడులతో హోరెత్తిస్తోన్నాయి. రష్యా సైనికుల దాడుల్లో- కర్ణాటక హవేరి జిల్లాకు చెందిన నవీన్ శేఖరప్ప అనే వైద్య విద్యార్థి మరణించింది ఖార్‌కీవ్‌లోనే.

సీ-17 గ్లోబ్ మాస్టర్..

సీ-17 గ్లోబ్ మాస్టర్..

ఖార్‌కీవ్‌లో చిక్కుకుపోయిన వారిని తరలించడానికి ప్రాధాన్యత ఇస్తోన్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా స్పష్టం చేశారు. భారత వైమానిక దళానికి చెందిన సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ను పంపించామని పేర్కొన్నారు. ఈ విమానం.. ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లింది కూడా. నేరుగా రొమేనియా రాజధాని బుడాపెస్ట్‌కు చేరుకుంటుంది. సీ-17తో పాటు ఎయిరిండియా సహా ఇతర ప్రైవేటు విమానాయాన సంస్థలను కూడా కేంద్ర ప్రభుత్వం బరిలో దింపింది.

ఇంకా 60 శాతం మంది ఉక్రెయిన్‌లోనే..

ఇంకా 60 శాతం మంది ఉక్రెయిన్‌లోనే..

వచ్చే రెండు మూడు రోజుల్లో 26 విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రానుంది. కాగా- ఇప్పటిదాకా 12,000 మంది భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దులను దాటుకుని పొరుగు దేశాలకు చేరుకున్నట్లు హర్షవర్ధన్ ష్రింగ్లా పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో ఉన్న భారత పౌరుల సంఖ్యలో ఇది 40 శాతం లోపే. ఇంకా వేలాదిమంది కీవ్, ఖార్‌కీవ్, సుమీ వంటి వేర్వేరు నగరాల్లో చిక్కుకుపోయారు. ఆయా నగరాలన్నీ రణరంగంగా మారాయి. అక్కడున్న భారత పౌరులను స్వదేశానికి తీసుకుని వచ్చే చర్యలను ముమ్మరం చేశామని అన్నారు.

 ఆ ప్రకటన ప్రకటన విడుదల చేసిన వెంటనే..

ఆ ప్రకటన ప్రకటన విడుదల చేసిన వెంటనే..

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కీవ్‌లోని భారత రాయబార కార్యలయం అధికారులు కీలక ప్రకటనను జారీ చేశారు. భారత విద్యార్థులు, పౌరులు తక్షణమే కీవ్‌ను వీడాలని సూచించారు. ఈ మేరకు తాజాగా అడ్వైజరీని జారీ చేశారు. ఇప్పటికిప్పుడు కీవ్‌ను వదిలి వెళ్లాలని ఆదేశించింది. ఏ మాత్రం జాప్యం చేయొద్దని పేర్కొంది. ఇంకొన్ని గంటల్లో రష్యా సైనిక బలగాలు కీవ్‌లోకి చొచ్చుకుని వచ్చే అవకాశం ఉందని భారత రాయబార కార్యాలయం అధికారులు అంచనా వేస్తోన్నారు.

 అంచనాలకు అనుగుణంగానే..

అంచనాలకు అనుగుణంగానే..

రష్యన్ సైన్యం కీవ్‌లోకి ప్రవేశించిన తరువాత ఇక్కడి పరిణామాలు మరింత అధ్వాన్నంగా మారొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఖార్కీవ్ తరహాలో స్ట్రీట్‌ఫైట్స్ చోటు చేసుకోవచ్చని, అదే జరిగితే- బయట అడుగు పెట్టలేని పరిస్థితులు ఉంటాయని భావిస్తున్నారు. పరిస్థితులు ఏ క్షణంలోనైనా చేయి దాటిపోతాయనే ఆందోళన భారత రాయబార కార్యాలయం అధికారుల్లో నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని- ఈ తాజా అడ్వైజరీని జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+