బంపర్ ఆఫర్: భారతీయురాలికి రూ.10 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ
అబుదాబిలో ఓ భారతీయురాలికి అధృష్టం తలుపు తట్టింది.
దుబాయ్: అబుదాబిలో ఓ భారతీయురాలికి అధృష్టం తలుపు తట్టింది.ఎంతోమంది ఆసక్తిగా, ఆశగా ఎదురుచూస్తున్న మిలియనీర్ బంపర్ లాటరీలో ఏకంగా రూ.17,69,03,813,39 సొంతం చేసుకొంది.
యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన రాఫెల్ బోనాంజా లాటరీ ఆమెను వరించింది.దాదాపుగా 50 ప్రయత్నాల తర్వాత ఈ అదృష్టం ఆమెకు దక్కింది.నిషితా రాధాకృష్ణ పిళ్ళై అనే మహిళా రెండేళ్ళపాటుగా ఆమె భర్తతో కలిసి మెడికల్ ప్రాక్టీస్ చేసింది.
ఆమె భర్త ఇప్పటికే 50 సార్లు రాఫెల్ బొనాంజా బిగ్ లక్కీ మిలియనీర్ లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేశాడు.దాదాపు 50 దఫాలు కొన్న ఆయన తన భార్య నిషితా పేరును 058390 నెంబర్ గల లాటరీ టిక్కెట్టును కొనుగోలు చేశాడు.

తాజాగా తీసిన లక్కీ డ్రాలో ఈ నెంబర్ కే లాటరీ తగిలింది. దీంతో నిషితా ఆమె భర్త సంతోషానికి అవధులు లేకుండా పోయాయిం. ఇద్దరు పిల్లల తల్లి అయిన రాధా ప్రస్తుతం టెక్సాస్ లో భర్తతో కలిసి ఉంటోంది. గత ఏడాది జూలైలో టెక్సాస్ లో జెనెటెక్స్ విభాగంలో ఫెలోషిప్ ప్రోగ్రాం పూర్తిచేసేందుకు వెళ్ళింది.
అక్కడి వెళ్ళినా కాని లాటరీ ప్రయత్నాలను ఆపలేదు. ఈ అదష్టం దక్కింది. ఇలా రాఫెల్ బొనాంజా ప్రారంభించిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో డబ్బు రూపంలో ప్రైజ్ మనీ పొందిన రెండో ఇండియన్ ఈమె.












Click it and Unblock the Notifications