సంచలనం: బంగ్లాదేశ్‌లో తయారవుతున్న వేల కోట్ల భారత నకిలీ కరెన్సీ! (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో ఏం ముద్రిస్తున్నారో తెలిస్తే షాక్ తినడం ఖాయం. ఇంతకీ ఆ ప్రింటింగ్ ప్రెస్‌లో ఏం ముద్రిస్తున్నారో తెలుసా? మన దేశానికి చెందిన కరెన్సీ నోట్లు.

అవును, దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అ ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడుందో తెలియదుకానీ అందులో కొన్ని వేల కోట్ల రూపాయల భారత కరెన్సీ ప్రింటింగ్ జరుగుతోంది.

రెండు వేలు, ఐదు వందలు నుంచి 50 రూపాయల నోట్ల వరకూ అక్కడ గుద్దేస్తున్నారు. అవి కూడా అచ్చం ఒరిజినల్ మాదిరిగానే కనిపిస్తున్నాయి. ఈ వీడియోను ఎవరు తీశారో, ఎవరు తొలుత సోషల్ మీడియాలో పోస్టు చేశారో తెలియదు.

కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన నకిలీ కరెన్సీని సరిహద్దులు దాటించి, భారత్ లో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే వాటిని ప్రింట్ చేస్తున్న వారి లక్ష్యమని వేరే చెప్పనక్కర్లేదు. మరి మన ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి!

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Proving the statement of central govt that 'duplication of new currency notes of India after demonetisation is impossible' wrong, Indian fake currency has been getting printed in plenty in Bangladesh. Fake currency mafia is getting ready to release them into the system breaking the very idea of PM Modi's, behind demonetisation. A printing press in Bangladesh is allegedly printing bundles of new currency notes to collapse Indian economy. They would send the bundles of notes to India without numbering and the fake currency gang in India will number them close to the original currency before releasing the fake notes into the market.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి