ఫోన్ కొనడానికి ఏకంగా సింగపూర్ వెళ్లాడు! తండ్రి, కుమార్తె, ఓ ఐఫోన్ కథ!
ఓ తండ్రి తన కుమార్తె పెళ్లికి గిఫ్ట్‌గా ఐఫోన్‌ను ఇవ్వాలనుకున్నాడు. దాన్ని కొనడానికి ఏకంగా సింగపూర్ వెళ్లాడు. అక్కడ దుకాణం ముందు ఓ రాత్రంతా క్యూలో నిలబడ్డాడు. చివరికి ఐఫోన్ 8 కొన్నాడు.
సింగపూర్: ఓ తండ్రి తన కుమార్తె పెళ్లికి గిఫ్ట్‌గా ఐఫోన్‌ను ఇవ్వాలనుకున్నాడు. దాన్ని కొనడానికి ఏకంగా సింగపూర్ వెళ్లాడు. అక్కడ దుకాణం ముందు ఓ రాత్రంతా క్యూలో నిలబడ్డాడు. దాదాపు 13 గంటల పాటు క్యూలో ఉండి ఐఫోన్ 8ప్లస్‌ను సొంతం చేసుకున్నాడు.
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఐఫోన్ కి ఉన్న క్రేజ్ ఇదే. భారత్‌కు చెందిన వ్యాపారవేత్త అమిన్ అహ్మద్ ధోలియా తన కుమార్తెకు పెళ్లి గిఫ్ట్ కింద ఐఫోన్ 8 ప్లస్‌ను కొనుగోలు చేయాలని అనుకున్నాడు.

అయితే.. ఆ ఫోన్ ఇంకా భారత మార్కెట్లోకి రానందున అతడు ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు సింగపూర్ వెళ్లాడు. ఆర్చర్డ్ రోడ్‌లో ఉన్న యాపిల్ స్టోర్ దగ్గర గురువారం సాయంత్రం ఏడు గంటల నుంచి వేచి ఉన్నాడు.
శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు స్టోర్ తెరవగానే వెళ్లి ఫోన్లు కొనుగోలు చేశాడు. ఈ విషయం గురించి సింగపూర్ డైలీ తన కథనంలో పేర్కొంది. 'నేను రెండు ఐఫోన్స్ కొన్నాను. ఒకటి నా కూతురికి ఇస్తాను. మొట్టమొదటిసారి రాత్రంతా నేను క్యూలో నిలబడ్డాను. ఆ అనుభూతి చాలా బాగుంది. కానీ రాత్రంతా నిలబడటం కష్టంగా కూడా అనిపించింది' అని ధోలియా ఉబ్బితబ్బిబై జరిగిందంతా చెప్పుకొచ్చాడు.
ఆయనతో పాటు దాదాపు 200 మంది విదేశీయులు క్యూలో నిలబడ్డారట ఆ ఫోన్ కొనేందుకు. సెప్టెంబరు 12న యాపిల్ ఐఫోన్ 8, 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. కానీ అన్ని దేశాల్లో ఇది అందుబాటులో లేదు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications