దుబాయ్‌లోనూ మ్యాగీ న్యూడుల్స్ బంపర్ ఆఫర్ , ఫినిష్
దుబాయ్: భారతదేశంలో మ్యాగీ నూడిల్స్ విక్రయాలను పలు రాష్ట్రాలు నిషేధించడం తెలిసిందే. నెస్లె ఇండియా కంపెనీ యాజమాన్యం మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్లను వెనక్కి తీసుకుంటున్నది. ఈ దెబ్బ రెండు రోజుల ముందు దుబాయ్‌లో పడింది.
అక్కడ మ్యాగీ ప్యాకెట్లు విక్రయించరాదని ఫుడ్ కంట్రోల్ డిపార్ట్ మెంట్ గురువారం నోటీసులు ఇచ్చింది. అయితే మ్యాగీ కంపెనీ ఏజెంట్లు లేకపోవడంతో అక్కడి మాల్స్ యాజమాన్యం సరి కొత్త ప్లాన్ వేసింది. మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్లను విక్రయించడానికి బంపర్ ఆఫర్లు పెట్టారు.
ఇండియాలో తయారైన ఆరు ఫ్లేవర్స్ మ్యాగీ నూడుల్స్ కొన్ని నెలల క్రితం దుబాయ్ కి ఎగుమతి అయ్యాయి. ఇప్పుడు మ్యాగీ మీద నిషేదం విధించడంతో అక్కడి మాల్స్ లో క్లియరన్స్ సేల్స్ విభాగంలో మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్లు పెట్టారు. అతి తక్కువ ధరకు విక్రయిస్తున్నామని బోర్డులు తగిలించారు.

అధికారులు నిషేదం విధించినా మ్యాగీ ప్యాకెట్లను క్లియరెన్స్ సేల్స్ కింద విక్రయిస్తున్నారని దుబాయ్ లోని స్థానిక పత్రిక ఖలీజ్ టైమ్స్ బయటపెట్టింది. విషయం తెలుసుకున్న అధికారులు మాల్స్ లో సోదాలు చేసి మ్యాగీ ప్యాకెట్ లను స్వాధీనం చేసుకుంటున్నారు.
మలేషియాలో తయారైన ఆరు మ్యాగీ ఫ్లేవర్స్ మాత్రమే విక్రయించాలని, భారత్ లో తయారైన మ్యాగీ ప్యాకెట్లు విక్రయించరాదని దుబాయ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ దెబ్బతో దుబాయ్ లో సైతం మ్యాగీ కథ అయిపోయింది.












Click it and Unblock the Notifications