భారత సంతతి గే సంచలనం: ఐర్లాండ్ ప్రధానిగా ఎన్నిక, రికార్డ్

Subscribe to Oneindia Telugu

డబ్లిన్: భారత సంతతికి చెందిన లియో వరద్కర్ ఐర్లాండ్ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఆయన తనను తాను గే అని స్వయంగా ప్రకటించుకోవడం గమనార్హం. అంతేగాక, అత్యంత పిన్న వయస్సులో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.

ఐర్లాండ్ ప్రధాని రేసులో భారతీయ గే: ఎవరీ లియో వరద్కర్?

కాగా, ఓ దేశానికి గే ప్రధాని కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. వరద్కర్ 2015లో తాను స్వలింగ సంపర్కుడినని ప్రకటించి సంచలనం సృష్టించారు. వరద్కర్ తండ్రి అశోక్ వరద్కర్‌ది ముంబై కాగా, తల్లి మిరియమ్‌ది ఐర్లాండ్.

Indian-origin Leo Varadkar elected as Ireland's youngest and first gay PM

కాగా, ఇప్పటికే క్యాబినెట్‌లోని పలువురు సీనియర్ మంత్రులు, మెజారిటీ ఎంపీలు వరద్కర్‌కు బహిరంగంగా మద్దతు పలికారు. ఐర్లాండ్ ప్రధాని ఎండా కెన్నీ ఇటీవలే తాను పదవి నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. దీంతో తాను ప్రధాని పదవికి పోటీ చేయనున్నట్టు వరద్కర్ ప్రకటించారు. మెజార్టీ మద్దతు లభించడంతో వరద్కర్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ireland's new Prime Minister Leo Varadkar on Wednesday evening announced his cabinet line-up, remaining largely the same as his predecessor Enda Kenny's cabinet.
Please Wait while comments are loading...