యువతి హత్య: ఆసీస్ బ్రిస్బేన్లో భారతీయుడి అరెస్ట్

పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు సెంథిల్ కుమార్ అరుముగమ్(31) బ్రిస్బేన్ నగరంలోని గార్డెన్ సిటీ షాపింగ్ సమీపంలోని ఓ హోటల్లో మంగళవారం రాత్రి మీనా నారాయణన్(27) అనే యువతిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో ఆమె అరుపులు విన్న హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు అరుముగమ్ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన మీనా అక్కడికక్కడే మృతి చెందారు. బుధవారం బాధితురాలి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలు మీనా సోదరుడు కూడా మంగళవారం రాత్రి బ్రిస్బేన్ నగరానికి చేరుకున్నాడు.
బ్రిస్బేన్ నగరంలోనే నివాసం ఉంటున్న మీనా.. క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో విద్యనభ్యసిస్తోంది. కాగా, మృతురాలికి, నిందితునికి వివాహం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. వారిద్దరూ సోమవారం రాత్రి మాత్రమే కలిశారని, ఆ తర్వాత మంగళవారం రాత్రి గొడవ కారణంగా ఆమెపై నిందితుడు కత్తితో దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications