టీనేజర్ల మధ్య గొడవ, భారత సంతతి విద్యార్థి మృతి.. ఎక్కడంటే...

విదేశీ గడ్డపై దారుణం జరిగింది.బర్త్‌డే పార్టీ సందర్భంగా టీనేజర్ల మధ్య తగాదా జరిగింది. భారత సంతతికి చెందిన ఓ టీనేజర్ చనిపోయాడు. ఈ ఘటన ఇజ్రాయెల్‌లో జరిగింది. కత్తితో పొడవడంతో మృతి చెందాడని శుక్రవారం స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. మృతుడిని యోల్ లెహింగేల్‌గా గుర్తించారు.

ఈశాన్య భారత దేశానికి చెందిన అతడు ఏడాది క్రితమే తన కుటుంబంతో సహా ఇజ్రాయెల్‌కు వెళ్లాడు. నాఫ్ హెజిల్ ప్రాంతంలో నివసించేవాడు. గురువారం భారత్ నుంచి ఇజ్రాయెల్ వచ్చిన మరో స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. యోల్ ఓ బర్త్‌డే పార్టీలో పాల్గొనేందుకు వెళ్లాడని సమాచారం. పార్టీలో టీనేజర్ల మధ్య తగాదా తలెత్తింది. ఆ రాత్రి మోల్ తన ఇంటికి తిరిగి వెళ్లలేదు.

 indian origin teen stabbed to death in israel

మరుసటి రోజు అతడి కుటుంబానికి..పార్టీలో తగాదా జరిగిన విషయం గురించి తెలిసింది. మోల్ తీవ్రంగా గాయపడ్డాడని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపాడు. వాళ్లు ఆస్పత్రికి బయలుదేరేలోపే యోల్ మరణించినట్టు మరో సమాచారం అందింది. ఘటనకు సంబంధించి 15 ఏళ్లు బాలుడిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత మరో ఏడుగురు టీనేజర్లను అదుపులోకి తీసుకున్నారు.

యోల్ చాలా స్నేహశీలి అని స్థానిక సామాజిక కార్యకర్త ఒకరు మీడియాకు తెలిపారు. ఇజ్రాయెల్ పరిస్థితుల్లో ఇట్టే ఇమిడిపోయాడని వివరించాడు. అతడు ఎవరితోనూ తగాదాకు దిగే రకం కాదని చెప్పాడు.ఈ హత్య వెనుక గల కారణాలను వెలికితీసేందు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+