అమ్మాయి కోసం వెళ్లి: పాక్‌లో జైలుపాలైన ఇండియన్

ఇస్లామాబాద్: గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో ఓ భారతీయుడికి పాకిస్తాన్ న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించిన సంఘటన మంగళవారం నాడు జరిగింది. పాక్‌లోని మిలటరీ న్యాయస్థానం భారతీయుడికి ఈ జైలు శిక్షను విధించింది.

భారత్‌కు చెందిన హమీద్‌ నెహాల్‌ అన్సారీ 2012లో పాకిస్థాన్‌ వెళ్లి అదృశ్యమయ్యాడు. అతను పాకిస్థాన్‌ నుంచి ఆప్ఘనిస్థాన్‌లోకి అక్రమంగా ప్రవేశించాడని, గూఢచర్యం చేశాడని అక్కడి పోలీసులు ఆరోపించారు.అతనికి ఏడు ఫేస్‌బుక్‌ ఐడీలు, 30 ఈ-మెయిల్‌ ఐడీలు ఉన్నాయని పాకిస్తాన్ ఆర్మీ అధికారులు చెప్పారు.

Indian sentenced to 3 years in jail for espionage in Pakistan

అతని వద్ద నుంచి కొన్ని సున్నితమైన అంశాలకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయని, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 3 సంవత్సరాల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఓ అమ్మాయి కోసం అన్సారీ పాకిస్తాన్ వచ్చాడని పేర్కొన్నారు.

అప్పటి నుంచి అతను తన కుటుంబంతోను కాంటాక్టులో లేడు. తమ దేశంలో గూఢచర్యం చేస్తున్నాడనే అనుమానంతో అరెస్ట్ చేసి దర్యాప్తు చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో అతనికి న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+