అమెరికాలో అదృశ్యమైన భారత విద్యార్థి మృత్యువాత

Indian student die in USA
చికాగో: అమెరికాలో గతవారం అదృశ్యమైన భారత సంతతి విద్యార్థి మరణించాడు. ప్రవీణ్ ఎం వరుగేసే అనే 19 ఏళ్ల భారత సంతతి విద్యార్థి గతవారం అమెరికాలో కనిపించకుండా పోయాడు. సదరన్ ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయానికి చెందిన అతను బుధవారం రాత్రి అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి పోలీసులు, కుటుంబ సభ్యులు అతని కోసం గాలిస్తూ వచ్చారు.

గాలింపు జరుపుతున్న నేపథ్యంలో మంగళవారం ప్రవీణ్ మృతదేహాన్ని ఇల్లినాయిస్ పరిధిలోని కార్బండేల్‌లో ఉన్న అటవీ ప్రాంతంలో కనుక్కున్నట్లు పోలీసులు తెలిపారు. అతని మృతికి కారణాలేమిటనేది తెలియరాలేదని చికాగో సన్ టైమ్స్ పత్రిక రాసింది.

మోర్టన్ గ్రోవ్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ చివరిసారిగా గత బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కార్బండేల్‌లో ఉన్నట్లు తెలిసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పటి నుంచి అతను కనిపించకపోవడం అన్వేషణ ప్రారంభించారు

సన్నిహితులతో కలిసి వెళ్లిన ప్రవీణ్ వరుగేసే వారితో గొడవ పడి, మధ్యలోనే అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఉంటాడని పోలీసుసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+