కాలిఫోర్నియాలో భారత్ విద్యార్థిని దారుణ హత్య
కాలిఫోర్నియా : ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థిని దుండగుల చేతిలో హత్యకు గురైయ్యింది. అమెరికాలోని కాలిఫోర్నియాలోని స్యాన్ ఫ్రాన్సిస్కో సమీపంలోని బే ఏరియా ఆపార్ట్ మెంట్ లో రణధీర్ కౌర్ (37) అనే డెంటల్ విద్యార్థిని మృతదేహం గుర్తించారు.
రణధీర్ కౌర్ డెంటల్ కాలేజ్ లో పీజీ విద్యాభ్యాసం చేస్తున్నది. 2016లో పీజీ పూర్తి చేసుకుని భారత్ తిరిగి రావలసి ఉంది. స్యాన్ ఫ్రాన్సిస్కోలోని బే ఏరియా అపార్ట్ మెంట్ లో రణధీర్ కౌర్ నివాసం ఉంటున్నది. ఈనెల 8వ తేదిన మద్యాహ్నం అపార్ట్ మెంట్ సమీపంలోని సిక్కుల దేవాలయంలో ప్రార్థనలు చేసిన కౌర్ తరువాత అపార్ట్ మెంట్ లోకి వెళ్లారు.

ఆ సమయంలో పక్క అపార్ట్ మెంట్ లో ఉంటున్న వారు విషయం గుర్తించారు. తరువాత గుర్తు తెలియని వారు అపార్ట్ మెంట్ లోకి చోరబడి తుపాకితో రణధీర్ కౌర్ ను కాల్చి చంపారని పోలీసు అధికారులు వెళ్లడించారు. హత్య చేసిన నిందితులు అపార్ట్ మెంట్ లో ఎలాంటి క్లూ చిక్కకుండ జాగ్రత పడ్డారు.
రణదీర్ కౌర్ నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ కు మూడు కిలో మీటర్ల దూరంలో ఆమెకు చెందిన కోన్ని వస్తువులు రోడ్డు పక్కన విసిరివేసి వెళ్లారని, వాటిని స్వాదీనం చేసుకున్నామని దర్యాప్తు చేస్తున్న అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆరు మంది పాత నేరస్తులు ( హంతకులు)లను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు చెప్పారు.
రణధీర్ కౌర్ కు పరిచయం ఉన్నవారు ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. రణదీర్ కౌర్ హత్య కేసు దర్యాప్తుకు స్పెషల్ టీం ను ఎర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications