ఇండియన్ స్టూడెంట్స్ పై ట్రంప్ పిడుగు..? ఊరెళ్లిపోతా మామ అంటున్న యువత..!
అమెరికా వెళ్లి డబ్బు సంపాదించాలని సగటు మధ్య తరగతి యువకుడి కల. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం అనుసరిస్తున్న తీరు చూస్తుంటే అలాంటి ఆశలపై నీళ్లు చల్లినట్లుగా భావించవచ్చు. అమెరికా ఫస్ట్ అనే కార్యక్రమాన్ని నెరవేర్చే దిశగా.. భారత్ తోపాటు ఇతర దేశాల నుంచి విద్య, ఉద్యోగం అని అమెరికా వస్తున్న యువతపై ట్రంప్ అడ్డంకులు సృష్టిస్తోంది.
ఉపాధి, ఉద్యోగ అవకాశాలు స్థానికులకే దక్కాలన్న నిర్ణయంతో ట్రంప్ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో విదేశీ విద్యార్థులపై కఠిన ఆంక్షలు విధిస్తోంది ట్రంప్ సర్కార్. దీంతో అమెరికాలో చదువు, ఉద్యోగం కావాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించి రావాలని అక్కడి ఎన్ఆర్ఐలు భారతీయ యువతకు సూచనలు చేస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లు మాత్రమే అమెరికాకు రావాలని చెబుతున్నారు.
పార్ట్ టైమ్ ఉద్యోగాల కోసం అయితే రాకపోవడమే ఉత్తమమని సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాలకు అనువైన వాతావరణం లేదని అభిప్రాయపడుతున్నరు. మరికొందరు అమెరికా కంటే యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి దేశాల్లో చదువుకునేందుకు, ఉద్యోగాలు పొందేందుకు పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని పేర్కొంటున్నారు.
తాజాగా ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేస్తూ ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే హార్వర్డ్ లో ఇప్పటికే 788 మంది భారత్ యువత నమోదైంది. తాజా నిర్ణయంతో వీళ్లంతా ఇతర విద్యాసంస్థలకు బదిలీ కావాల్సి ఉంది. ట్రంప్ ఆదేశాలతో 2025 ప్రవేశాలన్నీ రద్దు అవుతున్నాయి.
మరోవైపు కెనడా స్టడీ పర్మిట్ లలో విద్యార్థుల నమోదు భారీగా తగ్గిపోయినట్లు సమాచారం. భారతీయ విద్యార్థుల స్టడీ పర్మిట్ లలో గణనీయంగా తగ్గుదల నమోదవుతున్నట్లు తెలుస్తోంది. 2025 క్వార్టర్ లీలో కేవలం 30,640 పర్మిట్లు జారీ అయినట్లు సమాచారం. గతేడాదితో పోలిస్తే 31 శాతం మేర పర్మిట్లు తగ్గినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి అమెరికాకు భారతీయ యువత ఆసక్తి చూపించడం లేదని అర్థమవుతోంది.

2024 యూఎస్ ఎంబసీ లెక్కల ప్రకారం అమెరికాలో 3 లక్షల 50 వేలమందికి పైగా విద్యార్థులు ఉన్నత విద్య కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. గతేడాది కంటే 23 శాతం పెరిగినట్లు సమాచారం. మరోవైపు విదేశీ విద్యార్థులకు అందించే ఎఫ్-1 వీసాలను కేవలం 20 సెకన్లలోనే తిరస్కరణకు గురవుతున్నట్లు తెలుస్తోంది. రకరకాల ఆంక్షల కారణంగా విదేశీ విద్యార్థుల వీసాలు రిజెక్ట్ అవుతున్నట్లు సమాచారం.
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications